శరన్నవరాత్రులు ప్రారంభం

ABN , First Publish Date - 2022-09-27T07:11:01+05:30 IST

దసర శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని సోమవారం ఆలయాల్లో విశేష పూజలు ప్రారంభమయ్యాయి. ఆలయాల్లో అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హోమాలు, అలంకరణలు నిర్వహించారు.

శరన్నవరాత్రులు ప్రారంభం
అద్దంకిలో గుండ్లకమ్మ నుంచి జలాలు తీసుకొస్తున్న భక్తులు

ఆకట్టుకుంటున్న అమ్మవారి అలంకరణలు

గుండ్లకమ్మ నుంచి జలం తెచ్చి అభిషేకాలు  

అద్దంకిటౌన్‌, సెప్టెంబరు 26: దసర శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని సోమవారం ఆలయాల్లో విశేష పూజలు ప్రారంభమయ్యాయి. ఆలయాల్లో అమ్మవారికి  ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హోమాలు, అలంకరణలు నిర్వహించారు. అద్దంకిలోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు కోటా శ్రీనివాసకుమార్‌, సభ్యుల ఆధ్వర్యంలో విశేష పూజలు నిర్వహించారు. ఉదయం భక్తులు 102 కలశములతో గుండ్లకమ్మ నది నుండి జలాన్ని తీసుకొచ్చి అమ్మవారికి అభిషేకం చేశారు. అమ్మవారిని బాలాత్రిపుర సందరిగా అలంకరించారు. ధన్వంతరి దత్తపాదుకా క్షేత్రం, వేయ్యి స్తంభాల గుడిలోని అమ్మవారికి అర్చకులు పూజలు నిర్వహిం చారు. వేయ్యి స్తంభాల గుడి నుంచి భక్తులు అధిక సంఖ్యలో గుండ్లకమ్మకు తరలివెళ్లి జలాన్ని తీసుకొచ్చి అ మ్మవారికి అభిషేకము, అర్చన నిర్వహించారు. అమ్మవారికి లక్ష్మి గౌరి అలంకరణ చేశారు. కార్య క్రమా ల్లో భక్తులు, మహిళలు అధిక సంఖ్యలో  పాల్గొన్నారు.

పర్చూరు : దేవీ శరన్నవరాత్రి వేడుకలు సోమ వారంతో ప్రారంభమయ్యాయి. వేడుకల్లో భాగంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా స్ధానిక శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో తొలిరోజు కార్యక్రమంలో భాగంగా అమ్మవారిని శ్రీ స్వర్ణ కవచా లంకృత దుర్గాదేవిగా అలంకరించి పూజాలు చేశారు. వేడుకలు తొలిరోజు ఆలయ కమిటీ ఆధ్యక్షుడు శ్రీరాం వెంకటసుబ్బారావు ఆధ్వర్యంలో ఆలయాన్ని విద్యుత్‌ ద్వీపాలతో తీర్చిదిద్డారు. ఆలయ అర్చ కులు నల్లూరి హర్షవర్ధనాచారి ఆధ్వర్యం లో అమ్మవారికి పూజాకార్యక్రమాలు చేపట్టారు. 

చినగంజాం : మండల పరిధిలోని పలు దేవాలయాలలో దేవీ శరన్నరాత్రులు సోమ వారం ఘనంగా ప్రారంభమయ్యాయి. చినగంజాం వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారు కన్యకాపరమే శ్వరి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. మందిరంలోని బతుకమ్మ అమ్మవారికి మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సోపిరాల గ్రామం లోని శ్రీలలితా పరమేశ్వరి సమేత రామకోటేశ్వరస్వామి వారి దేవస్థానంలోని అమ్మవారిని స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా అలంకరించారు. అనంతరం భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. స్థానిక భూసమేత భావనారాయణస్వామి ఆలయంలో  13వ వార్షిక బ్రహ్మోత్సవాలను సోమవారం ఘనంగా ప్రారంభమైనాయి. ఈ సందర్భంగా ఆలయంలోని శ్రీవారిని, అమ్మవార్లను పెళ్లి కుమారుడు, పెళ్లి కుమారైలుగా అలంకరించి పూజలు నిర్వహించారు. రాత్రికి అంకురారోపణ పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ అభివృద్ధికమిటీ సభ్యుల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.   

కారంచేడు(పర్చూరు) : కారంచేడులోని శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి వేడుకల్లో భాగంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా తొలిరోజు అమ్మవారికి మహిళా భక్తులు కళశాలతో గ్రామోత్సవంగా బలయలుదేరి అమ్మవారికి పూజలు చేసి వేడుకలకు స్వాగతం పలికారు. 

పంగులూరు : మండలంలో గ్రామ గ్రామానదేవి శరన్నవరాత్రి  వేడుకలు సోమవారం ప్రారంభమయ్యా యి. విజయదశమి పర్వదినం సందర్భంగా తొమ్మిది రోజుల పాటు శ్రీదేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహణ కోసం పలు ఆలయాలు ముస్తాబ య్యాయి. నవరాత్రి ఉత్సవాల ను పురస్కరించుకుని ఆల యాలను విద్యుత్‌ దీపాలతో అలంకరించారు. పంగులూరు లోని శ్రీ భీమలింగేశ్వరస్వామి ఆలయంలో పార్వతీ అమ్మ వారు సోమవారం బాలత్రిపురసుందరీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భం గా పలువురు  భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. పంగులూరు,  చందలూరు, ముప్పవరం గ్రామాలలో వేడుకలు ప్రారంభమ య్యాయి.

వేటపాలెం(చీరాల) : మండల పరిధిలోని అణు మల్లిపేట మహాలక్ష్మమ్మ అమ్మవారి చెట్టు వద్ద బతుకమ్మ ఉత్సవాలను సోమవారం నుంచి ప్రారంభ మయ్యాయి. ముందుగా బతకమ్మలను ఊరేగింపుగా మండపం వద్దకు తీసుకొచ్చారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు ప్రసాద వితరణ జరిగింది. కార్య క్రమంలో మహిళా విభాగం ప్రతినిధులు చుండూరు రాజ్యలక్ష్మి, పత్తి.బాలవెంకట సీతారామఅనంతలక్ష్మి, కోడూరి కోటేశ్వరమ్మ, భారతి, రాజేశ్వరి,, గాయత్రి, కమిటీ అధ్యక్షులు ప్రత్తి వెంకటసుబ్బారావు, కార్యదర్శి చుండూరు నాగాంజనేయులు, వినోద్‌, శ్రీధర్‌, శ్రీనివాసరావు, శ్రీహరి, భక్తులు పాల్గొన్నారు.

Read more