అధికారం మాదీ..చెప్పినట్లు వినాల్సిందే..!

ABN , First Publish Date - 2022-10-15T05:21:50+05:30 IST

కలెక్టరేట్‌ పరిపాలన అధికారి(ఏవో) శ్రీనివాసరావుపై వైసీ పీ నేత దౌర్జన్యానికి దిగిన ఘటన ఆలస్యంగా వె లుగులోకి వచ్చింది. కలెక్టరేట్‌ ఏవోగా పనిచే స్తున్న శ్రీనివాసరావుపై ఒంగో లు మండలం కరవది గ్రామానికి చెందిన ఓ వై సీపీ నేత ఈ దౌర్జన్యానికి పాల్పడ్డారు.

అధికారం మాదీ..చెప్పినట్లు వినాల్సిందే..!

 స్వీపర్ల ఏజెన్సీ విషయంపై కలెక్టరేట్‌ ఏవోపై వైసీపీ నేత దౌర్జన్యం 


ఒంగోలు(కలెక్టరేట్‌), అక్టోబరు 14: కలెక్టరేట్‌ పరిపాలన అధికారి(ఏవో) శ్రీనివాసరావుపై వైసీ పీ నేత దౌర్జన్యానికి దిగిన ఘటన ఆలస్యంగా వె లుగులోకి వచ్చింది. కలెక్టరేట్‌ ఏవోగా పనిచే స్తున్న శ్రీనివాసరావుపై  ఒంగో లు మండలం కరవది గ్రామానికి చెందిన ఓ వై సీపీ నేత ఈ దౌర్జన్యానికి పాల్పడ్డారు. వాస్తవా లు తెలుసుకొని మాట్లాడాలని ఏవో చెప్తున్నా అ వేమి పట్టించుకోకుండా ‘‘అధికారం మాదీ.. మే ము చెప్పింది నీవు వినాల్సిందే.. నీవు చెప్పింది వినేది ఏమిటి’’ అంటూ దౌర్జన్యంగా వ్యవహరించి నట్లు తెలిసింది. అందిన సమాచారం మేరకు..

 కలెక్టరేట్‌లో పారిశుధ్యం పనులు చేసేందుకు నార్త్‌ ఇండియాకు చెందిన  ఒక ఏజెన్సీ పొందిం ది. ఈ ఏజెన్సీ పరిధిలో కలెక్టరేట్‌ 20మంది వ రకు స్వీపర్లు పనిచేస్తున్నారు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక ఏజెన్సీకి సకాలంలో డ బ్బులు చెల్లించకపోవడంతో కొద్దిరోజులపాటు స్వీ పర్లను తొలగించారు. అయితే కలెక్టరేట్‌ అపరిశు భ్రంగా మారడంతో కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ ఆదేశా లతో ఏవో శ్రీనివాసరావు మరలా ఆ ఏజెన్సీ ప్ర తినిధితో మాట్లాడారు. అయితే సకాలంలో వేత నాలు రాని నేపథ్యంలో పది మందితో పనిచేసే విధంగా ఒప్పందం చేసుకున్నారు. దాని ప్రకారం ఏజెన్సీ ప్రతినిధి స్వీపర్లను ఏర్పాటు చేసి పని చేస్తున్నారు. దీంతో కరవదికి చెందిన వైసీపీ నేత తమ పార్టీకి చెందిన వర్కర్లను తొలగిస్తారా అం టూ కలెక్టరేట్‌కు వచ్చారు. కలెక్టరేట్‌లో ఏవోతో మాట్లాడే సమయంలో వైసీపీ నేత దౌర్జన్యంగా వ్యవహరించారు. ఈ విషయం తమ పరిధిలోది కాదని, స్వీపర్లను ఏర్పాటు చేసుకునేది ఏజెన్సీ అ ని చెప్తున్నా అవేమి పట్టించుకోకుండా తాము చె ప్పిందే చేయాల్సిందేనని అంటూ వైసీపీ నేత మండిపడ్డారు. ఆ సమయంలో కలెక్టరేట్‌ పెద్ద ఎ త్తున కేకలు వినిపించడంతో ఉద్యోగులు అక్కడ కు చేరుకున్నారు. ఆ సమయంలో సహనం కో ల్పోయిన సదరు నేత మరింత రెచ్చిపోయినట్లు తెలిసింది. ప్రభుత్వం తమదని, మా పార్టీకి చెం దిన కార్మికులను తొలగించి ప్రతిపక్ష పార్టీకి చెం దిన కార్మికులను ఏ విధంగా నియమించకుంటా రని కేకలు వేస్తూ బయటకు వెళ్ళారు. అయితే అక్కడ జరిగిన ఘటనను కలెక్టరేట్‌ ఏవో శ్రీనివా సరావు వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకె ళ్ళినట్లు తెలిసింది. కాగా శుక్రవారం కలెక్టరేట్‌లో జరిగిన గొడవపై విస్తృతంగా చర్చకు దారి తీసింది. పనిచేసే కార్మికుల విషయంలో కూడా వైసీపీ నేత అనుసరించిన విధానాలపై అటు అ ధికారులు, ఇటు ఉద్యోగులు మండిపడుతున్నా రు. ఎటువంటి సంబంధం లేని వ్యక్తులు వచ్చి అధికార పార్టీ పేరుతో దౌర్జన్యం చేయడంపై ప లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 


Updated Date - 2022-10-15T05:21:50+05:30 IST