విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించాలి

ABN , First Publish Date - 2022-11-24T23:47:41+05:30 IST

విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలిం చాలని ఎంపీడీవో విజయలక్ష్మి పేర్కొన్నారు. గురువారం మండలంలోని పెదగంజాం గ్రామ పంచాయతీ పరిఽధిలోని పెదగంజాం-2, పల్లెపాలెం గ్రామ సచివాలయాలను, ఎస్సీ కాలనీలోని ప్రాథమిక పాఠశాల, అం గన్‌వాడీ కేంద్రాన్ని ఆమె తనిఖీ చేశారు.

విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించాలి

చినగంజాం, నవంబరు 24: విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలిం చాలని ఎంపీడీవో విజయలక్ష్మి పేర్కొన్నారు. గురువారం మండలంలోని పెదగంజాం గ్రామ పంచాయతీ పరిఽధిలోని పెదగంజాం-2, పల్లెపాలెం గ్రామ సచివాలయాలను, ఎస్సీ కాలనీలోని ప్రాథమిక పాఠశాల, అం గన్‌వాడీ కేంద్రాన్ని ఆమె తనిఖీ చేశారు. గ్రామ సచివాలయాల్లోని రికార్డులను, బయోమెట్రిక్‌ హాజరు, సంక్షేమ పథకాల లబ్ధిదారుల వివ రాలను ఆమె పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు అందజేశారు. జేఎస్‌ఎస్‌, జీఎస్‌డబ్ల్యూఎస్‌ సేవలను, హౌసింగ్‌ పురోగతిని పరిశీలిం చారు. గ్రామంలో జరుగుతున్న నాడు-నేడు పనులను, ప్రభుత్వ భవ నాల పనులు, జేజేఎం పని ప్రదేశాలను సందర్శించారు. పెదగంజాం ఎస్సీ కాలనీలోని ప్రాథమిక పాఠశాలను సందర్శించి విద్యార్థులతో కలిసి ఎంపీడీవో మధ్యాహ్న భోజనం చేశారు. మోనూ ప్రకారం మధ్యాహ్నభోజనం ఉండాలని, రుచి, శుచిగా విద్యార్థులకు భోజనం తయారుచేయాలని కుకింగ్‌ నిర్వాహకులకు సూచించారు. అంగన్‌వాడీ కేంద్రంలోని రికార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో గ్రామ కార్యదర్శులు, సచివాలయ ఉద్యోగులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-24T23:47:41+05:30 IST

Read more