జిల్లాలో పది కొత్త హైస్కూళ్లు

ABN , First Publish Date - 2022-07-08T04:58:44+05:30 IST

జిల్లాలో కొత్తగా పది హైస్కూళ్ళు ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు అందుబాటులోకి రానున్నాయి. పదవ తరగతి వరకు విద్యార్థులు అధికంగా ఉన్న ప్రాథమికోన్నత పాఠశాలలను హైస్కూళ్లుగా అప్‌గ్రేడ్‌ చేస్తున్నారు. వాటిల్లో ప్రస్తుతం 9వ తరగతి ప్రారంభిస్తున్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం మూడు కిలోమీటర్ల పరిధిలో హైస్కూలు లేని ప్రాథమికోన్నత పాఠశాలల్లో 195 మందికి పైగా విద్యార్థులు ఉంటే వాటిని హైస్కూళ్ళుగా అప్‌గ్రేడ్‌ చేయనున్నారు. కలెక్టర్‌ ఆధ్వర్యంలోని కమిటీ ఇందుకు ఆమోదముద్ర వేసింది.

జిల్లాలో పది కొత్త హైస్కూళ్లు

ఒంగోలు(విద్య), జూలై 7 : జిల్లాలో కొత్తగా పది హైస్కూళ్ళు ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు అందుబాటులోకి రానున్నాయి. పదవ తరగతి వరకు విద్యార్థులు అధికంగా ఉన్న ప్రాథమికోన్నత పాఠశాలలను హైస్కూళ్లుగా అప్‌గ్రేడ్‌ చేస్తున్నారు. వాటిల్లో ప్రస్తుతం 9వ తరగతి ప్రారంభిస్తున్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం మూడు కిలోమీటర్ల పరిధిలో హైస్కూలు లేని ప్రాథమికోన్నత పాఠశాలల్లో 195 మందికి పైగా విద్యార్థులు ఉంటే వాటిని హైస్కూళ్ళుగా అప్‌గ్రేడ్‌ చేయనున్నారు. కలెక్టర్‌ ఆధ్వర్యంలోని కమిటీ ఇందుకు ఆమోదముద్ర వేసింది. ఒంగోలు మండలం గుండాయిపాలెం, చీమకుర్తి మండలం పి.నాయుడుపాలెం, తర్లుపాడు మండలం నాగళ్ళముడిపి, త్రిపురాంతకం మండలం విశ్వనాథపురం, పుల్లలచెరువు మండలం ముటుకుల, వైపాలెం మండలం మురారిపల్లె, మార్కాపురం మండలం పెదమాచవవరం, అర్ధవీడు మండలం మాగుటూరు, పెదచెర్లోపల్లి మండలం మురుగుమ్మి ప్రాథమికోన్నత పాఠశాలలు అప్‌గ్రేడ్‌ కానున్నాయి. ఈ పాఠశాలల్లో ప్రస్తుతం పనిచేస్తున్న ఎస్జీటీ తొలగించి వారి స్థానంలో స్కూలు అసిస్టెంట్లను నియమిస్తారు. ఒంగోలు నగర పాలక సంస్థ పరిఽధిలో 340మందికిపైగా విద్యార్థులు ఉన్న బాలాజీనగర్‌ యూపీ స్కూలును కూడా హైస్కూలుగా అప్‌గ్రేడ్‌ చేశారు.  

  

Read more