టీడీపీ విజయం కోసం పాటుపడాలి

ABN , First Publish Date - 2022-11-23T22:37:40+05:30 IST

టీడీపీ విజయం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్‌ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి చెప్పారు. కర్నూలులో బుధవారం కనిగిరి ప్రాంతం నుంచి వలస వెళ్లిన ముఖ్యులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ ఉగ్ర మాట్లాడుతూ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలన్నారు.

టీడీపీ విజయం కోసం పాటుపడాలి
కనిగిరి ప్రాంతానికి చెందిన ముఖ్య నాయకులతో సమావేశమైన డాక్టర్‌ ఉగ్ర

నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే ఉగ్ర

కనిగిరి, నవంబరు 23 : టీడీపీ విజయం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్‌ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి చెప్పారు. కర్నూలులో బుధవారం కనిగిరి ప్రాంతం నుంచి వలస వెళ్లిన ముఖ్యులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ ఉగ్ర మాట్లాడుతూ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలన్నారు. రానున్న ఎన్నికలు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉంటాయని, రాక్షస పాలన అంతమొందించాలంటే మళ్లీ చంద్రన్నను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. వైసీపీ అరాచక పాలన వల్ల రాష్ట్రం అంధకారంలోకి వెళ్లడంతో పాటు భావితరాలు ఉజ్వల భవిష్యత్తు అంతా నాశనమయ్యే ప్రమాదం పొంచి ఉందని తెలిపారు. అనంతరం డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డికి తమ పూర్తి సహకారం ఉంటుందని వారు ప్రకటించారు. ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ సమావేశంలో పువ్వాడి వెంకటేశ్వర్లు, ఏలూరి వెంకటేశ్వర్లు, కేశవులు, దారపనేని చెన్నయ్య, కిశోర్‌, సుబ్బారాయుడు, సురేష్‌, తిరుపతయ్య, నరసింహా, భాస్కర్‌ పాల్గొన్నారు.

మంత్రాలయంలో పామూరు వాసులను కలిసిన ఉగ్ర

పామూరు, నవంబరు 23 : ప్రముఖ పుణ్యక్షేత్రమైన కర్నూలు జిల్లాలోని మంత్రాలయ రాఘవేంద్ర స్వామి దేవస్థానాన్ని కనిగిరి టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్‌ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి డాక్టర్‌ కవిత దంపతులు బుధవారం దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. మంత్రాలయానికి వచ్చిన ఉగ్ర దంపతులను టీడీపీ పామూరు మండల కమిటీ అధ్యక్షుడు పువ్వాడి వెంకటేశ్వర్లు, ఒంగోలు పార్లమెంట్‌ నియోజకవర్గ తె లుగురైతు అధ్యక్షుడు ఏలూరి వెంకటేశ్వర్లు స్వాగతం పలికారు. అనంత రం మాజీ ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్‌ జన్మదిన వేడుకల్లో ఉగ్ర పాల్గొని బొకే అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ విషయం తెలుసుకుని మంత్రాలయంలో ఉంటున్న పామూరు వాసులు ఉగ్ర దంపతులను కలిసి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంటు తెలుగురైతు కార్యనిర్వాహక కార్యదర్శి గుంటుపల్లి చినచెంచయ్య, గోళ్ల లక్ష్మీనారాయణ గుంటుపల్లి చెంచురామయ్య, జి సుబ్బరాయుడు, చెరుకూరు శ్రీకాంత్‌, ఉడత కిశోర్‌, కె. రమేష్‌ గోల్ల తిరుపాలు, చుంచు నరసింహం పాల్గొన్నారు.

Updated Date - 2022-11-23T22:37:40+05:30 IST

Read more