యూనివర్సిటీ పేరు మార్పుపై టీడీపీ నిరసన

ABN , First Publish Date - 2022-09-30T05:22:47+05:30 IST

ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీకి వైఎస్‌ఆర్‌ పేరు పెట్టడంపై పొదిలి టీడీపీ నాయకులు ఆ పార్టీ మండలాధ్యక్షుడు మీగడ ఓబులరెడ్డి ఆధ్వర్యం లో గురువారం స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం వద్ద రిలే నిరాహారదీక్ష చేశారు.

యూనివర్సిటీ పేరు మార్పుపై టీడీపీ నిరసన
నిరసన తెలుపుతున్న టీడీపీ నాయకులు

పొదిలిరూరల్‌, సెప్టెంబరు 29 : ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీకి వైఎస్‌ఆర్‌ పేరు పెట్టడంపై పొదిలి టీడీపీ నాయకులు ఆ  పార్టీ మండలాధ్యక్షుడు మీగడ ఓబులరెడ్డి ఆధ్వర్యం లో గురువారం స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం వద్ద రిలే నిరాహారదీక్ష చేశారు. అనంతరం ఓబులరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వాలు మారిన ప్పుడల్లా మహనీయుల పేర్లు తొలగించడం సమంజసంకాదన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభు త్వం తమ మొండివైఖరిని వీడి వెంటనే యూని వర్సిటీకి ఎన్టీఆర్‌ పేరును కొనసాగించాలన్నారు. ఆంధ్రులు ఆరాధ్య దైవంగా చెప్పుకునే ఎన్టీఆర్‌ పేరును మారిస్తే ఊరుకునేదిలేదన్నారు. పేరు మార్పుతో తనతండ్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి అత్మకూడా ఘోషిస్తోందన్నారు. చేతనైతే జగన్మోహన్‌రెడ్డి మరో యూనిర్సిటీ ఏర్పాటు చేసి తన తండ్రిపేరును పెట్టుకోవాలన్నారు.  పాలనచేయడం చేతకాక రాష్ట్రాన్ని జగన్‌ బ్రష్టు పట్టిస్తున్నాడన్నారు. కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు ముల్లా ఖుద్దూస్‌, జడ్‌పీటీసీ మాజీ సభ్యుడు కాటూరి పెదబాబు, మాజీ సర్పంచ్‌ చినబాబు, లీగల్‌సెల్‌ నాయకులు ఎస్‌ఎం.భాష, షబ్బీర్‌ టీడీపీ జిల్లా కార్యదర్శి వెంకటేశ్వరరెడ్డి, పొల్లా నరసింహరావు, టీఎన్‌ఎస్‌ఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి గౌస్‌, తెలుగు మహిళా కార్యదర్శి షహనాజ్‌, పట్టణ ప్రధాన కార్యదర్శి కాటూరి శ్రీనివాసులు, తెలుగు యువత మండల అధ్యక్షుడు నరేష్‌, మైనారిటీ సెల్‌ పట్టణ ప్రధాన కార్యదర్శి మౌలాలి, ఎస్సీ నాయకులు ఠాగూర్‌, జ్యోతి మల్లిఖర్జున్‌, టీడీపీ నాయకులు గోగినేని వెంకట్రావ్‌, సోమయ్య, పుట్టా ఏడుకొండలు, మాగులూరి కృష్ణ, ముల్లా ఖయ్యూం, సందాని, ఐటిడిపి కాలేషా, కాటం వెంకటేశ్వరరెడ్డి, మెహరూన్‌ పాల్గొన్నారు.

తిరుపతిపల్లిలో బాదుడేబాదుడు

గిద్దలూరు : మండలంలోని తిరుపతిపల్లి గ్రామంలో టీడీపీ ఆధ్వర్యంలో గురువారం రాత్రి బాదుడేబాదుడు కార్యక్రమం నిర్వహించారు. పలువురు టీడీపీ నాయకులు మాట్లాడుతూ గడిచిన మూడేళ్లలో వైసీపీ ప్రభుత్వం ప్రజలకు చేసిందేమిటో చెప్పాలని ప్రశ్నించారు. గ్రామాల్లో చిన్నపాటి రోడ్లను కూడా నిర్మించలేని దుస్థితిలో జగన్‌ ప్రభుత్వం ఉందని ధ్వజమెత్తారు. టీడీపీ హయాంలో అర్హులందరికీ రేషన్‌కార్డులు, ఫించన్లు, పక్కాగృహాలు మంజూరు చేయగా జగన్‌ ప్రభుత్వం రకరకాల సాకులతో పథకాలను రద్దు చేసిందన్నారు. పేదలను నడిరోడ్డుకు ఈడ్చారన్నారు. సమావేశంలో టీడీపీ  మండల అధ్యక్షుడు మార్తాల సుబ్బారెడ్డి, గ్రామకమిటీ అధ్యక్షుడు ఆగోలు శివనాగార్జున, టీడీపీ నాయకులు బ్రహ్మానందరెడ్డి, బయ్యపురెడ్డి, రసూల్‌రెడ్డి, తిరుపతయ్య, పెద్దిరాజు, శ్రీనివాసులు, గిద్దలూరు మున్సిపల్‌ కౌన్సిలర్‌ చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.

Read more