టీడీపీ సభ్యత్వాలు తీసుకోవాలి

ABN , First Publish Date - 2022-10-04T03:46:14+05:30 IST

తెలుగుదేశం పార్టీ సభ్యత్వాన్ని ప్రతి ఒక్కరూ తీసుకోవాలని పార్టీ మండలాధ్యక్షుడు వేమూరి రామయ్య అన్నారు.

టీడీపీ సభ్యత్వాలు తీసుకోవాలి

పీసీపల్లి, అక్టోబరు 3 : తెలుగుదేశం పార్టీ సభ్యత్వాన్ని ప్రతి ఒక్కరూ తీసుకోవాలని  పార్టీ మండలాధ్యక్షుడు వేమూరి రామయ్య అన్నారు. మండలంలోని గుదేవారిపాలెంలో సోమవారం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు.  సభ్యత్వ నమోదు తీసుకున్న కార్యకర్త కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందన్నారు. కుటుంబ క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని అధినేత చంద్రబాబు బీమా సౌకర్యం కల్పించారని తెలిపారు. వైసీపీ అరాచకాలు, దాడులు, అక్రమాలను ప్రజలకు తెలి యజేసే బాధ్యత టీడీపీ నాయకులపై ఉందన్నారు. కార్యక్రమంలో జోసెఫ్‌, సుబ్బ రాయుడు, మాచర్లు, వెంకయ్య,  సర్పంచ్‌ శాంసన్‌, లక్ష్మీనారాయణ, వెంకట సుబ్బయ్య, వెంకట్రావు, నవీన్‌, సుబ్బారావు, సత్యం పాల్గొన్నారు. 

 


Read more