-
-
Home » Andhra Pradesh » Prakasam » TDP membership registration should be expedited-MRGS-AndhraPradesh
-
టీడీపీ సభ్యత్వ నమోదును వేగవంతం చేయాలి
ABN , First Publish Date - 2022-09-18T05:19:55+05:30 IST
టీడీపీ సభ్యత్వ నమో దును వేగవంతం చేయాలని ఎమ్మెల్యే రవికుమార్ అన్నా రు. శనివారం దైవాలరావూరు లో పార్టీ నాయకులు, కార్యక ర్తలతో ఆయన మాట్లాడారు.

మేదరమెట్ల, సెప్టెంబరు 17: టీడీపీ సభ్యత్వ నమో దును వేగవంతం చేయాలని ఎమ్మెల్యే రవికుమార్ అన్నా రు. శనివారం దైవాలరావూరు లో పార్టీ నాయకులు, కార్యక ర్తలతో ఆయన మాట్లాడారు. అద్దంకి నియోజకవర్గంలో పార్టీ సభ్యత్వ నమోదులో వె నుకబడి ఉన్నామన్నారు. బా దుడే బాదుడు కార్యక్రమాన్ని అన్నిగ్రామాల్లో నిర్వహిం చాలని చెప్పారు. ధరల పెరుగుదలతో సామాన్యులు పడుతున్న ఇబ్బందులను, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలన్నారు. గుండ్లకమ్మ ప్రాజెక్టులో ఉన్న మూడు టీఎంసీల నీటిని ప్రభుత్వం నిర్లక్ష్యంతో సముద్రంలోకి వదలాల్సి వచ్చిందన్నారు.
దైవాలరావూరుకు చెందిన కందిమళ్ల ప్రేమ్‌చంద్ ఇటీవల అనారోగ్యానికి గురై మృతి చెందాడు. శనివారం ఎమ్మెల్యే రవికుమార్ దైవాలరావూరులో ప్రేమ్ చంద్ చిత్రపటానికి నివాళులర్పించారు. ప్రేమ్‌చంద్ కుమారులు, కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన వెంట చెన్నుపాటి హరిబాబు, ముమ్మన నరసింహారావు, మేదరమెట్ల శ్రీనివాసరావు, ఆళ్ల హనుమంతరావు, కరిచేటి రాంబాబు, మద్దినేని రాఘవస్వామి, కోనూరి చంద్రశేఖర్, గొట్టిపాటి చంద్ర శేఖర్, వజ్జా వేణుబాబు, ముమ్మన వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు.