కొడాలి వాఖ్యలపై తమ్ముళ్ల ఆగ్రహం!

ABN , First Publish Date - 2022-09-13T06:43:09+05:30 IST

వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి, ఆయన తనయుడు లోకేష్‌ను ఉద్దేశించి చేసిన అనుచిత వాఖ్యలపై టీడీపీ శ్రేణులు భగ్గుమన్నాయి.

కొడాలి వాఖ్యలపై తమ్ముళ్ల ఆగ్రహం!
కొడాలి దిష్టిబొమ్మకు దహన సంస్కారాలు చేస్తున్న టీడీపీ నేతలు

నాని దిష్టిబొమ్మకు చెప్పులదండ, దహన సంస్కారాలు 

అడ్డుకున్న పోలీసులు 

ఇరువర్గాల మధ్య తోపులాట 

ఒంగోలు (కార్పొరేషన్‌), సెప్టెంబరు 12 : వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి, ఆయన తనయుడు లోకేష్‌ను ఉద్దేశించి చేసిన అనుచిత వాఖ్యలపై టీడీపీ శ్రేణులు భగ్గుమన్నాయి.  సోమవారం ఒంగోలు అద్దంకి బస్టాండ్‌లో ఉన్న ఎన్టీఆర్‌ విగ్రహం ఎదుట రోడ్డుపై బైఠాయించాయి. ఈ సందర్భంగా కొడాలి నాని దిష్టిబొమ్మకు చెప్పులదండ వేసి నిరసన తెలిపారు. అనంతరం దిష్టిబొమ్మకు దహన సంస్కారాలు నిర్వహించి నానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిరసన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకోవడంతో పెనుగులాట చోటుచేసుకుంది. దీంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పోలీసుల అడ్డగింత మధ్యనే టీడీపీ నాయకులు తమ నిరసనను కొనసాగించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ తమ నాయకుడు చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని విమర్శించే అర్హత, స్థాయి నానికి లేదన్నారు. జగన్‌రెడ్డి మెప్పు కోసం వ్యక్తిగత విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఇదే పరిస్థితి కొనసాగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు. అంతకుముందు పార్టీ కార్యాలయం నుంచి ఎన్టీఆర్‌ విగ్రహం వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షుడు కొఠారి నాగేశ్వరరావు, ఒంగోలు పార్లమెంట్‌ నాయకులు దాయనేని ధర్మ, గుర్రాల రాజ్‌విమల్‌, తెలుగు మహిళరాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఆర్ల వెంకటరత్నం, రాష్ట్ర కార్యదర్శి కామరాజుగడ్డ కుసుమ కుమారి, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నాళం నరసమ్మ, ఒంగోలు పార్లమెంట్‌ అధ్యక్షురాలు రావుల పద్మజ, ప్రధాన కార్యదర్శి బీరం అరుణ, నగర అధ్యక్షురాలు పసుపులేటి సునీత, టి.అనంతమ్మ, గంగవరపు పద్మ  పాల్గొన్నారు. 



Updated Date - 2022-09-13T06:43:09+05:30 IST