టీడీపీ నాయకుడు ‘గుండవరపు’ హఠాన్మరణం

ABN , First Publish Date - 2022-05-18T05:54:17+05:30 IST

టీడీపీ సీనియర్‌ నాయ కుడు, వాటర్‌ డ్రిస్టిబ్యూటరీ కమిటీ మాజీ ప్రెసి డెంట్‌, ఒంగోలు డెయిరీ మాజీ డైరెక్టర్‌ గుండ వరపు శ్రీనివాసులు(49) మంగళవారం వేకువ జామున గుండెపోటుతో మృతి చెందారు.

టీడీపీ నాయకుడు ‘గుండవరపు’ హఠాన్మరణం

 


స్వగ్రామం పల్లామల్లిలో అంత్యక్రియలు

నివాళులర్పించిన ఎమ్మెల్యే కరణం బలరాం, పలువురు నాయకులు


చీమకుర్తి, మే 17 : టీడీపీ సీనియర్‌ నాయ కుడు, వాటర్‌ డ్రిస్టిబ్యూటరీ కమిటీ మాజీ ప్రెసి డెంట్‌, ఒంగోలు డెయిరీ మాజీ డైరెక్టర్‌ గుండ వరపు శ్రీనివాసులు(49) మంగళవారం వేకువ జామున గుండెపోటుతో మృతి చెందారు. గత ప దిరోజులుగా అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపో యారు. శ్రీనివాసులు భౌతికకాయానికి స్వగ్రామ మైన పల్లామల్లిలో మంగళవారం సాయంత్రం అంత్యక్రియలు ఘనంగా జరిగాయి. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య వెంకటశేష మ్మ పల్లామల్లి సర్పంచ్‌గా సేవలు అందించారు. అలాగే డీసీ అధ్యక్షుడిగా, డెయిరీ డైరెక్టర్‌గా శ్రీని వాసులు రైతులకు విశేష సేవలు చేశారు. పల్లా మల్లి గ్రామ అభివృద్ధికి హితోధికంగా ఎంతో కృషి చేసిన శ్రీనివాసులును స్వయంగా నాటి సీఎం నారా చంద్రబాబునాయుడు నుంచి అభినందన లు అందుకున్నారు. మండలంలో టీడీపీ అభివృ ద్ధికి విశేషమైన సేవలు అందించిన ఆయన కీలక నాయకునిగా గుర్తింపు పొందారు. కాగా చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి శ్రీనివాసు లు భౌతికకాయాన్ని సందర్శించి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మాజీ ఎ మ్మెల్యే, నియోజకవర్గ ఇన్‌బార్జి బీఎన్‌.విజయ్‌కు మార్‌ తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. ఆయ న మృతి తీరని లోటని, కుటుంభసభ్యులకు సం తాపాన్ని తెలిపారు. పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు శ్రీనివాసులు మృతిపై సంతాపం వ్యక్తం చేశారు. టీడీసీ నాయకులు మన్నం ప్రసా ద్‌, కొండ్రగుంట వెంకయ్య, గొట్టిపాటి రాఘవరా వు, గొల్లపూడి సుబ్బారావు, వేల్పుల శ్రీను తదితర నాయకులు శ్రీనివాసుల మృతదేహన్ని సందర్శిం చి ఘన నివాళులర్పించారు.

 


Read more