సబ్‌జైలు ప్రారంభం

ABN , First Publish Date - 2022-02-20T04:26:22+05:30 IST

గిద్దలూరు పట్టణంలో నూతనంగా నిర్మించిన సబ్‌ జైలును జిల్లా జైళ్ల శాఖ డీఎస్పీ వెంకటరెడ్డి శనివారం ప్రారంభించారు.

సబ్‌జైలు ప్రారంభం
సబ్‌జైలును ప్రారంభిస్తున్న జిల్లా జైళ్ల శాఖ డీఎస్పీ వెంకటరెడ్డి


గిద్దలూరు టౌన్‌, ఫిబ్రవరి 19 : గిద్దలూరు పట్టణంలో నూతనంగా నిర్మించిన సబ్‌ జైలును జిల్లా జైళ్ల శాఖ డీఎస్పీ వెంకటరెడ్డి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఎస్పీ వెంకటరెడ్డి మాట్లాడుతూ కొంతకాలంగా సబ్‌జైలు లేకపోవడంతో ఈప్రాంత ముద్దాయిలను మార్కాపురం తరలించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇక నుంచి సబ్‌జైలు ఉపయోగంలోకి రానున్నదని పేర్కొన్నారు. కార్యక్రమంలో గిద్దలూరు సీఐ ఫిరోజ్‌, సబ్‌ జైలు సూపరింటెండెంట్‌ లింగారెడి పాల్గొన్నారు.


Read more