సబ్సిడీ యంత్రాలను సద్వినియోగం చేసుకోవాలి

ABN , First Publish Date - 2022-09-20T05:13:48+05:30 IST

చిన్న సన్నకారు ఉద్యానవన రైతులకు అధిక సబ్సిడీతో ఇస్తున్న యంత్రాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ దినే్‌షకుమార్‌ అన్నారు. స్థానిక కలెక్టరేట్‌లో సోమవారం పొదిలి, దొనకొండ, చీమకుర్తి మండలాలకు చెందిన 58 మంది రైతులకు రూ. 58 లక్షల విలువైన పరికరాలను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రూ. 10 లక్షల లబ్ధిదారులు తమ వాటాగా చెల్లించారని, మిగిలిన డబ్బులను ప్రభుత్వం సబ్సిడీ రూపంలో అందించిందన్నారు.

సబ్సిడీ యంత్రాలను సద్వినియోగం చేసుకోవాలి
పరికరాలను అందజేస్తున్న కలెక్టర్‌ దినేష్‌కుమార్‌

ఒంగోలు(కలెక్టరేట్‌), సెప్టెంబరు 19 : చిన్న సన్నకారు ఉద్యానవన రైతులకు అధిక సబ్సిడీతో ఇస్తున్న యంత్రాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ దినే్‌షకుమార్‌ అన్నారు. స్థానిక కలెక్టరేట్‌లో సోమవారం పొదిలి, దొనకొండ, చీమకుర్తి మండలాలకు చెందిన 58 మంది రైతులకు రూ. 58 లక్షల విలువైన పరికరాలను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రూ. 10 లక్షల లబ్ధిదారులు తమ వాటాగా చెల్లించారని, మిగిలిన డబ్బులను ప్రభుత్వం సబ్సిడీ రూపంలో అందించిందన్నారు. ఐదు ఎకరాల వరకు 90శాతం సబ్సిడీని, ఏడు ఎకరాల వరకు ఉన్న రైతులకు 70శాతం సబ్సిడీని ప్రభుత్వం ఇస్తుందన్నారు. నీటి వనరులను సమర్థవంతంగావినియోగిచుకుంటూ అధిక దిగుబడి సాధించేలా ఉద్యాన రైతులకు ప్రభుత్వం ఈ సహాయం చేస్తుందని తెలిపారు.   ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ అధికారి శ్రీనివాసరావు, ఏపీఎంఐసీ పీడీ రవీంద్రబాబు, ఉద్యానశాఖ సహాయ సంచాలకులు గోపీచంద్‌ తదితరులు ఉన్నారు. 

నులిపురుగుల పోస్టర్‌ ఆవిష్కరించిన కలెక్టర్‌

పిల్లలు, కిశోర బాలలందరికీ ఈనెల 21వతేదీన నులిపురుగుల నివారణకు ఆల్‌ బెండాజోల్‌ మాత్రలు పంపిణీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ దినే్‌షకుమార్‌ పిలుపునిచ్చారు. స్థానిక కలెక్టరేట్‌లోని స్పందన హాలులో సోమవారం జాతీయ నులిపురుగుల నిర్మూలనా కార్యక్రమం పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈకార్యక్రమంలో జేసీ అభిషిక్త్‌ కిషోర్‌, డీఆర్వో చిన్న ఓబులేషు,డీఈవో విజయభాస్కర్‌ తదితరులు ఉన్నారు.

కారుణ్యనియామక ఉద్యోగ పత్రం అందజేత

విధుల నిర్వహణలో అంకిత భావంతో ఉండాలని కలెక్టర్‌ దినే్‌షకుమార్‌ అన్నారు. కారుణ్య నియామకం కింద ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసులో బాధిత కుటుంబంలోని ఒకరికి సోమవారం కలెక్టర్‌ ఉద్యోగ నియామక పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో జేసీ అభిషిక్త్‌ కిషోర్‌, డీఆర్వో చిన్న ఓబులేషు, జిల్లా ఎస్సీ సంక్షేమ, సాధికారత అధికారి లక్ష్మానాయక్‌, ఇతర పలుశాఖల అధికారులు ఉన్నారు. 


Read more