సముద్ర తీరాల వద్ద గట్టి బందోబస్తు

ABN , First Publish Date - 2022-11-07T23:46:27+05:30 IST

పల్లెపాలెం, మోటుపల్లి, పెదగంజాం సముద్ర తీరాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్‌ఐ కట్టా అనూక్‌ తెలిపారు.

సముద్ర తీరాల వద్ద గట్టి బందోబస్తు

చినగంజాం, నవంబరు 7: పల్లెపాలెం, మోటుపల్లి, పెదగంజాం సముద్ర తీరాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్‌ఐ కట్టా అనూక్‌ తెలిపారు. మోటుపల్లి, పల్లెపాలెం, పెదగంజాం సముద్రతీరాలను సోమవారం ఆయన పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. మంగళవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా సముద్రస్నానాలకు వచ్చే భక్తులు పలు జాగ్రత్తలు తీసుకొని స్నానాలు అచరించాలని ఎస్‌ఐ పేర్కొన్నారు. లోతుకు వెళ్లి స్నానాలు చేయరాదని సూచించారు. ప్రమాదాలు జరగకుండా మైరన్‌ పోలీసులతో పాటు గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. భక్తులు పోలీసుల సూచనలు పాటిస్తూ స్నానాలు ఆచరించాలని ఎస్‌ఐ కోరారు.

భక్తులకు సేవ చేయటంలోనే ఆనందం

చీరాల, నవంబరు 7: భక్తులకు సేవచేయటం అదృష్టంగా భావిస్తు న్నామని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఎంఎం కొండయ్య చెప్పారు. కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భంగా మండల పరిధిలోని వాడరేవుకు సోమవారం సముద్రస్నానాలు ఆచరించేందుకు వచ్చిన భక్తులకు టీడీపీ ఆధ్వర్యంలో అల్పాహార ప్రసాదం, మంచినీరు అందజేశారు. కొండయ్య చేతుల మీదుగా వీటిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తీరంలో ఏర్పాట్లను కొండయ్య పరిశీలించి భక్తులతో మాట్లాడారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు కార్తీకమాసం పూర్తయ్యేవరకు తమవంతు బాధ్యతగా భక్తులకు సహాయ, సహకారాలు అందించాలని సూచిం చారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

Updated Date - 2022-11-07T23:46:27+05:30 IST

Read more