సీజనల్‌ వ్యాధుల నివారణకు ప్రత్యేక చర్యలు

ABN , First Publish Date - 2022-11-24T23:55:07+05:30 IST

జిల్లాలో సీ జనల్‌ వ్యాధుల నివారణకు ప్రత్యేకచర్యలు తీసు కోవాలని డీఎంహెచ్‌వో రాజ్యలక్ష్మి ఆదేశించారు.

  సీజనల్‌ వ్యాధుల నివారణకు ప్రత్యేక చర్యలు

డీఎంహెచ్‌వో రాజ్యలక్ష్మి

ఒంగోలు(కలెక్టరేట్‌) నవంబరు 24 : జిల్లాలో సీ జనల్‌ వ్యాధుల నివారణకు ప్రత్యేకచర్యలు తీసు కోవాలని డీఎంహెచ్‌వో రాజ్యలక్ష్మి ఆదేశించారు. ఒంగోలులోని డీఎంహెచ్‌వో కార్యాలయంలో గురు వారం వైద్యాధికారులతో జరిగిన సమావేశంలో ఆ మె మాట్లాడుతూ వాతావరణ మార్పుల కారణం గా సీజనల్‌ వ్యాధులు అనేక ఇబ్బందులు పెడుతు న్నాయని తెలిపారు. ఇటీవల కురిసిన వర్షాల వల్ల మురుగు చేరి దోమలు ఎక్కువగా కావడంతో సీజ నల్‌ వ్యాధులు అధికమవుతున్నాయని చెప్పారు. జి ల్లాలో అనేక మంది సీజనల్‌ ఫీవర్‌తో బాధప డుతున్నారని, అలాగే దగ్గు, జలుబు, గొంతు నొప్పి, జ్వరం, కడుపునొప్పి, వాంతులు, విరోచనాలు, శ్వా సకోశ సమస్యలు, తిన్న ఆహారం జీర్ణం కాక ఇబ్బం దులు పడుతున్నారని వివరించారు. ఆయా సమ స్యలు సీజనల్‌ వ్యాఽధికిందకు వస్తాయన్నారు. అం దువల్ల వైద్యాధికారులు తమ ప్రాంతంలో వ్యాధుల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు ము రుగు నీరు తొలగించేలా ప్రజలకు అవగాహన క ల్పించాలన్నారు వ్యాధులను ముందుగానే గుర్తించి ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు అందుకు అవసరమైన వైద్యసేవలను కూడా అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో వైద్యశాఖ అధికారులు మాధవీలత, వాణిశ్రీ, శ్రీవా ణి, సుగుణమ్మ, డీపీవో సుబ్బలక్ష్మి పాల్గొన్నారు.

Updated Date - 2022-11-24T23:55:07+05:30 IST

Read more