కేసుల విచారణ జాప్యంపై ఎస్పీ సీరియస్‌

ABN , First Publish Date - 2022-11-24T23:57:11+05:30 IST

తీవ్రమైన నేరా లకు సంబంధించిన కేసులు నమోదు అనంతరం విచారణలో జరుగుతున్న జాప్యంపై ఎస్పీ మలిక గర్గ్‌ మండిపడ్డారు. గురువారం ఒంగోలులోని పో లీసు కార్యాలయం ఆవరణంలో గెలాక్సీభవన్‌లో జిల్లా నేరసమీక్షా సమావేశం జరిగింది.

 కేసుల విచారణ జాప్యంపై ఎస్పీ సీరియస్‌

14 మంది అధికారులకు షోకాజ్‌ నోటీసులు

మహిళల మీద జరిగే నేరాలపై అప్రమత్తంగా ఉండాలి

సమీక్షలో మలికగర్గ్‌ ఆదేశం

ఒంగోలు(క్రైం), నవంబరు 24: తీవ్రమైన నేరా లకు సంబంధించిన కేసులు నమోదు అనంతరం విచారణలో జరుగుతున్న జాప్యంపై ఎస్పీ మలిక గర్గ్‌ మండిపడ్డారు. గురువారం ఒంగోలులోని పో లీసు కార్యాలయం ఆవరణంలో గెలాక్సీభవన్‌లో జిల్లా నేరసమీక్షా సమావేశం జరిగింది. ఈ సంద ర్భంగా ఎస్పీ మాట్లాడుతూ 2020 సంవత్సరంలో జరిగిన తీవ్రమైన నేరాలలో విచారణ జాప్యం గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అప్పట్లో జరి గిన హత్య నేరాలతో పాటుగా దొంగతనాలు, దోపి డీలు, సైబర్‌నేరాలు పెండింగ్‌లో ఉండటంపై ఆగ్ర హం వ్యక్తం చేశారు. అప్పట్లో విచారణాధికారులు గా ఉన్న 14మందికి షోకాజ్‌ నోటీసులు ఇవ్యాలని ఆదేశించారు. అదేవిధంగా మహిళలపై జరిగే నే రాలను ఏ పోలీస్‌స్టేషన్‌లో అయినా జీరో ఎఫ్‌ఐఆ ర్‌తో నమోద చేసి సంబంధిత స్టేషన్‌కు బదిలీ చే యాలని చెప్పారు. అదేవిధంగా వృతి నైపుణ్యాన్ని పెంపొందించుకొని విచారణ చేసి నేరస్థులకు శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. స్టేషన్‌ల పరిధిలో నిత్యం పెట్రోలింగ్‌ నిర్వహించాలని స్ప ష్టం చేశారు. పాత నేరస్థులపై నిఘా ఉంచాలని చెప్పారు. సమావేశంలో ఏఎస్పీలు కె.నాగేశ్వరరా వు, శ్రీఽధర్‌రావు, సూర్యచంద్రరావు, ఏఆర్‌ ఏఎస్పీ అశోక్‌బాబు, ఎస్బీ డీఎస్పీ మరియదాసు, డీఎ స్పీలు, సీఐ దేవప్రభాకర్‌, లీగల్‌ అడ్వైజర్‌ వేణుగో పాల్‌ తదితరులు పాల్గొన్నారు.

డీజీపీ అభినందనలు

ఇటీవల తిరుమలలో జరిగిన బ్రహ్మోత్సవాలకు బందోబస్తు నిర్వహించిన పోలీసు అధికారులను డీజీపీ రాజేంద్రనాఽఽథ్‌రెడ్డి అభినందించారు. జిల్లా నుంచి తిరుమల వెళ్ళిన ఏఆర్‌ డీఎస్పీ అశోక్‌బా బు, డీఎస్పీలు రామకృష్ణ, కిషోర్‌కుమార్‌లను ఎ స్పీ మలికగర్గ్‌ అభినందించి, డీజీపీ పంపించిన ప్రశంసాపత్రాలను అందజేశారు.

పామూరు సిబ్బందికి ఎస్పీ ప్రశంస

పామూరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గస్తీలో ఉన్న పోలీసులు కారు ఆపి తనిఖీలు నిర్వహించారు. అందులోని వారిని పట్టుకుని విచారించగా గు ప్త నిధులు తవ్వకాల కోసం వచ్చినట్లు అంగీకరించా రు. దీంతో తనిఖీలో పాల్గొన్న హెడ్‌ కానిస్టేబుళ్లు రహంతుల్లా, డి.రమణయ్య, హోంగార్డు ఎ.వెంకటే శ్వర్లును ఎస్పీ అభినందించి ప్రశసాపత్రాలను అం దజేశారు.

Updated Date - 2022-11-24T23:57:11+05:30 IST

Read more