-
-
Home » Andhra Pradesh » Prakasam » Soon yellow buying centers will be set up-NGTS-AndhraPradesh
-
త్వరలో పసుపు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు
ABN , First Publish Date - 2022-06-07T06:52:59+05:30 IST
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో త్వరలో పసుపు కొనుగోళ్ల కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ ఆదేశించారు. సోమవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్‌లోని జేసీ చాంబర్‌లో మార్కెటింగ్, వ్యవసాయ, మార్క్‌ఫెడ్ అధికారులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతుల వద్ద నుంచి మద్దతు ధర క్వింటా రూ. 6,850తో కేంద్రాల్లో కొనుగోళ్లు చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.

క్వింటా రూ. 6,850 మద్దతు ధరకు కొనుగోలు
ఒంగోలు(కలెక్టరేట్), జూన్ 6 : రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో త్వరలో పసుపు కొనుగోళ్ల కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ ఆదేశించారు. సోమవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్‌లోని జేసీ చాంబర్‌లో మార్కెటింగ్, వ్యవసాయ, మార్క్‌ఫెడ్ అధికారులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతుల వద్ద నుంచి మద్దతు ధర క్వింటా రూ. 6,850తో కేంద్రాల్లో కొనుగోళ్లు చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ క్రాప్‌లో నమోదు చేసుకున్న పసుపురైతులు సీఎంఏపీపీలో త్వరలో రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అనుమతి ఇస్తామని తెలిపారు. ఒక్కొక్క రైతు నుంచి గరిష్ఠంగా 30 క్వింటాళ్ల వరకు కొనుగోలు చేస్తారని, జిల్లాలోని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జేసీ కోరారు. సమావేశంలో ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.