సమాజ నిర్దేశకులుగా ఎదగాలి

ABN , First Publish Date - 2022-02-20T04:32:05+05:30 IST

విద్యార్థులు కేవలం చదువు కాకుండా సమాజ నిర్దేశకులుగా ఎదగాలని ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డి అ న్నారు.

సమాజ నిర్దేశకులుగా ఎదగాలి
మాట్లాడుతున్న ఎమ్మెల్యే కుందురు

ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి 

పొదిలి రూరల్‌ ఫిబ్రవరి 19 : విద్యార్థులు కేవలం చదువు కాకుండా సమాజ నిర్దేశకులుగా ఎదగాలని ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డి అ న్నారు. పొదిలి ప్రభుత్వ బాలికల ఉన్నతపాఠశాలలో శనివారం జరిగిన ఇగ్నైట్‌ యంగ్‌ మైండ్స్‌ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పొదిలి, కొన కనమిట్ల మండలాలకు చెందిన అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యా ర్థినీ విద్యార్థులకు ఇంగ్లీష్‌పై ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు ప్రతిభ కలిగిన ఉపా ధ్యాయులను నియమించారని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమానికి హాజరైన విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడుతూ విద్యార్థులు చదువు తో పాటు అన్ని విషయాలలో రాణించేలా పిల్లలు క్రమశిక్షణతో ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. బాలికలు ఉన్నత చదువులకు తల్లిదం డ్రులు చొరవచూపాలన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సీఆర్పీలు  జీవీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు.


Read more