గరుడ వాహనంపై చెన్నకేశవుడు

ABN , First Publish Date - 2022-04-25T05:08:06+05:30 IST

మార్కాపురంలోని శ్రీలక్ష్మీచెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. పదో రోజైన ఆదివారం స్వామివారి గురుడ వాహనంపై శ్రీమహావిష్ణువు అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.

గరుడ వాహనంపై చెన్నకేశవుడు
గరుడ వాహనంపై చెన్నకేశవుడు(ఇన్‌సెట్లో) వాహన సేవను తిలకిస్తున్న ప్రజలు

మార్కాపురం(వన్‌టౌన్‌), ఏప్రిల్‌ 24:  మార్కాపురంలోని శ్రీలక్ష్మీచెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. పదో రోజైన ఆదివారం స్వామివారి గురుడ వాహనంపై శ్రీమహావిష్ణువు అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. నాలుగు మాఢవీధుల్లో ఊరేగారు. స్వామివారిని దర్శించుకొని భక్తులు పులకించిపోయారు. అర్చకులు శ్రీపతి అప్పనాచార్యులు స్వామి ఉత్సవమూర్తిని శోభాయమానంగా అలంకరించారు. ఎమ్మెల్యేలు నాగార్జునరెడ్డి, రాంబాబు, మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి గరుడ వాహనసేవలో పాల్గొన్నారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

Read more