26 నుంచి శరన్నవరాత్రి ఉత్సవాలు

ABN , First Publish Date - 2022-09-18T03:41:00+05:30 IST

ప్రముఖ పర్యాటక శైవక్షేత్రం భైరవకోనలోని త్రిముఖ దుర్గాంబాదేవి ఆలయంలో ఈ నెల 26వ తేదీ నుంచి అక్టోబర్‌ 5వ తేదీ వరకు శరన్నవరాత్రి మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఈవో నారాయణరెడ్డి తెలి పారు.

26 నుంచి శరన్నవరాత్రి ఉత్సవాలు
పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న ఈవో నారాయణరెడ్డి

సీఎస్‌పురం, సెప్టెంబరు 17 : ప్రముఖ పర్యాటక శైవక్షేత్రం భైరవకోనలోని త్రిముఖ దుర్గాంబాదేవి ఆలయంలో ఈ నెల 26వ తేదీ నుంచి అక్టోబర్‌ 5వ తేదీ వరకు శరన్నవరాత్రి మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఈవో నారాయణరెడ్డి తెలి పారు. మహోత్సవాలకు సంబంధించిన ప్రచారపత్రాన్ని భైరవకోనలో శుక్రవారం ఆ యన ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మహోత్సవాలలో భా గంగా ప్రతిరోజూ విశేష పూజలు, కుంకుమార్చనలు, బిల్వార్చన ఉంటుందన్నారు. ఉదయం 8గంటలకు రుద్ర, దుర్గా, గణపతి హోమాలు, మంత్ర పుష్ప పూజలు జ రుగుతాయని తెలిపారు.  తొమ్మిదిరోజులపాటు అమ్మవారు వివిధ అలంకారాల్లో భ క్తులకు దర్శనమిస్తారని తెలిపారు. కార్యక్రమంలో దేవస్థాన చైర్మన్‌ సిద్ధు రమణా రెడ్డి, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.  


Read more