మార్కాపురం సబ్‌ కలెక్టర్‌గా సేతుమాధవన్‌

ABN , First Publish Date - 2022-10-12T06:22:38+05:30 IST

మార్కాపురం సబ్‌ కలెక్టర్‌గా ఎస్‌.సేతుమాధవన్‌ నియమితులయ్యారు. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.

మార్కాపురం సబ్‌ కలెక్టర్‌గా సేతుమాధవన్‌

మార్కాపురం, అక్టోబరు 11: మార్కాపురం సబ్‌ కలెక్టర్‌గా ఎస్‌.సేతుమాధవన్‌ నియమితులయ్యారు. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. తమిళనాడులోని కృష్ణగిరికి చెందిన సేతుమాధవన్‌ 2020 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన వారు. బిహార్‌ కేడర్‌ ఐఏఎస్‌గా పనిచేస్తూ ఆంధ్రప్రదేశ్‌ కేడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఎస్‌.ఎస్‌.శోభికను వివాహం చేసుకున్నారు. అనంతరం ఏపీ కేడర్‌కు మారారు. గతంలో ఐఏఎస్‌ శిక్షణలో భాగంగా మార్కాపురం డివిజన్‌లోని త్రిపురాంతకం మండలంలో ఏడు రోజులు తహసీల్దార్‌గా పని చేశారు. 

Read more