నెట్‌బాల్‌ జిల్లా జట్ల ఎంపిక

ABN , First Publish Date - 2022-12-30T01:35:06+05:30 IST

స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో నెట్‌బాల్‌ జట్ల ఎంపిక గురువారం ఒంగోలులోని సాయిబాబా సెంట్రల్‌ స్కూల్‌లో జరిగింది. అండర్‌-14, అండర్‌-17 విభాగాలలో బాల, బాలికల జట్ల ఎంపిక నిర్వహించగా, సుమారు 200 మంది క్రీడాకారులు పాల్గొన్నారు.

నెట్‌బాల్‌ జిల్లా జట్ల ఎంపిక
జిల్లా జట్లకు ఎంపికైన బాలబాలికలు

ఒంగోలు (కార్పొరేషన్‌), డిసెంబరు 29 : స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో నెట్‌బాల్‌ జట్ల ఎంపిక గురువారం ఒంగోలులోని సాయిబాబా సెంట్రల్‌ స్కూల్‌లో జరిగింది. అండర్‌-14, అండర్‌-17 విభాగాలలో బాల, బాలికల జట్ల ఎంపిక నిర్వహించగా, సుమారు 200 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ప్రతిభగల వారిని జిల్లా జట్టుకు ఎంపిక చేశారు. ఎంపికైన జట్లు జనవరి 11 నుంచి నెల్లూరు జిల్లా ఆత్మకూరులో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటారని స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ జిల్లా సెక్రటరీ సీహెచ్‌.సుబ్బారావు తెలిపారు. ఎంపిక పోటీలలో పీఈటీ అసో సియేషన్‌ సెక్రటరీ వై.శీనయ్య, పాఠశాల ప్రిన్సిపాల్‌ ఎం.మహేష్‌, వ్యాయామ ఉపా ధ్యాయుడు ఐపీ రాజు ఉన్నారు.

Updated Date - 2022-12-30T01:35:35+05:30 IST

Read more