-
-
Home » Andhra Pradesh » Prakasam » schools mergy parents angry-MRGS-AndhraPradesh
-
బడుల విలీనంపై భగ్గు
ABN , First Publish Date - 2022-07-06T05:02:44+05:30 IST
బడుల విలీనంపై విద్యార్థుల తల్లిదండ్రులు భ గ్గుమన్నారు. ప్రాథమిక పా ఠశాలల్లోని 3,4,5 తరగతులను హైస్కూళ్లలో కలపడా న్ని వ్యతిరేకిస్తూ జిల్లాలోని పలుప్రాంతాల్లో మంగళవా రం ఆందోళనలకు దిగారు.

ఆ ప్రక్రియ ఆపాలంటూ విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళనలు
చిన్నఉల్లగల్లులో బడికి తాళం వేసి నిరసన
పెద్దఉల్లగల్లులో రాస్తారోకో
యడవల్లిలో విద్యార్థుల ధర్నా
ముండ్లమూరు/రాచర్ల జూలై 5 : బడుల విలీనంపై విద్యార్థుల తల్లిదండ్రులు భ గ్గుమన్నారు. ప్రాథమిక పా ఠశాలల్లోని 3,4,5 తరగతులను హైస్కూళ్లలో కలపడా న్ని వ్యతిరేకిస్తూ జిల్లాలోని పలుప్రాంతాల్లో మంగళవా రం ఆందోళనలకు దిగారు. ముండ్లమూరు మండలం చి న్నఉల్లగల్లు ఎస్సీ కాలనీ పాఠశాల గేటుకు తాళం వేసి బైఠాయించారు. ఈ సందర్భంగా కా లనీవాసులు మాట్లాడుతూ తా మంతా నిరుపేదలమని, పనులకు వెళ్తే గాని పూటగడవదని ఆవేదన వ్య క్తం చేశారు. కొన్ని నెలలపాటు కూలి పనుల కోసం వలసలు కూడా వెళ్తుంటామని తెలిపారు. ఈ నేపథ్యంలో గ్రామంలో బ డి ఉండడంతో మా పిల్లలు ఇబ్బంది లేకుండా చదువుకుంటున్నారని, ఇప్పుడు 3, 4, 5 తరగతులను మరో బడిలో విలీనం చేస్తే అం త దూరం పిల్లలు వెళ్లి చదువుకోవడం కష్టమని ఆందోళన వ్యక్తం చేశారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యా హ్నం వరకు రోడ్డుపైనే బైఠాయించారు. విలీనానికి ఒప్పుకునే ప్రస క్తే లేదని స్పష్టం చేశారు. అధికారులు హామీ ఇచ్చేంత వరకూ ఉపాధ్యాయులను పాఠశాలలోకి అనుమతివ్వబోమని తేల్చి చెప్పారు. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని ఎంఈవో ఎన్.సాంబశివరావు చెప్పడంతో వారు ఆందోళన విరమించారు. విద్యా కమిటీ చైర్మన్ మల్లవరపు నాగరాజు, కో-ఆప్షన్ మెంబర్ చైతన్య మనోహర్, తప్పెట నాగరాజు, రోశయ్య పాల్గొన్నారు.
పెద్దఉల్లగల్లులో..
మండలంలోని పెద్దఉల్లగల్లు కొత్తూరు ప్రాథమిక పాఠశాల 3,4,5 తరగతుల విద్యార్థులను ప్రాథమిక ఉన్నత పాఠశాలలో విలీనం చేయడాన్ని నిరసిస్తూ మంగళవారం పాఠశాలకు ఎదురుగా అద్దంకి-దర్శి ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. విలీనం నిర్ణయాన్ని తక్షణమే విరమించుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. రాస్తారోకోతో అద్దంకి - దర్శి ప్రధాన రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. కార్యక్రమంలో డీవైఎ్‌ఫఐ జిల్లా ప్రధాన కార్యదర్శి కేవీ పిచ్చయ్య, మాజీ సర్పంచ్ గొంది వెంకటప్పారెడ్డి, విద్యా కమిటీ మాజీ చైర్మన్ అన్నపురెడ్డి భిక్షాలరెడ్డి, రామిరెడ్డి, గురవమ్మ, నాసర్‌బీ, హుస్సేనమ్మ, మహబూబీ, నాగేశ్వరి పాల్గొన్నారు.
యడవల్లిలో..
రాచర్ల : యడవల్లి ఎస్సీకాలనీలోని పాఠశాల వద్ద విద్యార్థులు ప్లకార్డులు పట్టుకుని ధర్నా చేపట్టారు. గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. 3,4,5 తరగతులకు యడవల్లి హైస్కూలులో కలపడం వలన వర్షం వస్తే వాగు దాటి వెళ్లలేని పరిస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక్కడున్న స్కూలులోనే 1 నుంచి 5వ తరగతి వరకు కొనసాగించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. అలాగే అనుమలపల్లి ఎంపీపీ స్పెషల్ స్కూలును యూ పీ స్కూలులో కలుపడాన్ని నిరసిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఎంఈవో కార్యాలయం లో వినతిపత్రం అందజేశారు.