సచివాలయ సెక్రటరీలకు వేతన కష్టాలు..!

ABN , First Publish Date - 2022-04-24T05:47:53+05:30 IST

ఒంగోలు నగ రంలోని సచివాలయ ఉద్యోగులకు వేతన కష్టాలు మొ దలయ్యాయి. అధికారుల నిర్లక్ష్యంతో గత ఏడాది వేత నం నేటికీ విడుదల కాలేదు. అసలే చాలీచాలని జీతం, ఆపై ఇంటి అద్దెలు, అప్పు చేసి కొనుకున్న వస్తువులకు ఈఎంఐలకే సరిపోతుండగా, నెల నెలా వస్తేనే కనాక ష్టంగా సాగే కుటుంబాలు ఇపుడు నెలరన్నయినా జీ తం రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

సచివాలయ సెక్రటరీలకు వేతన కష్టాలు..!
వార్డు సచివాలయం

ఒంగోలులో వార్డు సెక్రటరీలు, వలంటీర్లకు ఇంకా విడుదల కాని జీతాలు

అధికారుల నిర్లక్ష్యమేనని ఉద్యోగుల విమర్శ

రూ.15వేలతో కష్టంగా కుటుంబ జీవనం 

ఉద్యోగాల పర్మినెంట్‌పైనా నీలినీడలు


ఒంగోలు(కార్పొరేషన్‌), ఏప్రిల్‌ 23 : ఒంగోలు నగ రంలోని సచివాలయ ఉద్యోగులకు వేతన కష్టాలు మొ దలయ్యాయి. అధికారుల నిర్లక్ష్యంతో గత ఏడాది వేత నం నేటికీ విడుదల కాలేదు. అసలే చాలీచాలని జీతం, ఆపై ఇంటి అద్దెలు, అప్పు చేసి కొనుకున్న వస్తువులకు ఈఎంఐలకే సరిపోతుండగా, నెల నెలా వస్తేనే కనాక ష్టంగా సాగే కుటుంబాలు ఇపుడు నెలరన్నయినా జీ తం రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రత్యేకించి ఒంగోలు నగరంలోనే ఈ సమస్య ఏర్పడిం ది. నగరంలోని 70 సచివాలయాల్లో పని చేస్తున్న సు మారు 650 మంది సచివాలయ సెక్రటరీల ఇళ్ళలో ఆ కలి కేకలు వినిపిస్తున్నాయి. ఒక్కో సెక్రటరీకి నెలకు రూ.15వేలు వేతనంగా అందిస్తున్నారు. చాలీచాలని వే తనమైనా ఏనాటికైనా పర్మినెంట్‌ కాకపోతుందా అనే ఆశతో కాలాన్ని నెట్టుకొస్తున్నామని పలువురు సెక్రటరీ లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే సాంకేతిక లో పమో, లేక ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాలే దనుకుంటే పొరపాటే. సాక్ష్యాత్తు ఇక్కడ నగరపాలక సంస్థ అధికారుల నిర్లక్ష్యమే స్పష్టంగా కనిపిస్తుంది. గ త కమిషనర్‌గా ఉన్న నిరంజన్‌రెడ్డి హాయంలో ప్రతి నెలా ఒకటో తేదిన ఠంచనుగా వేతనాలు పడగా, ప్ర స్తుత కమిషనరు భాగ్యలక్ష్మి బాధ్యతలు తీసుకున్న త ర్వాత వేతన కష్టాలు మరింత మొదలయ్యాయని కొ ందరు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు దయ తలచి వేతనాలు విడుదల చేయాలని సచివాలయ ఉ ద్యోగులు వాపోతున్నారు. ఇదిలా ఉండగా, వార్డు సచి వాలయంలో అనుబంధమైన వలంటీర్లకు ఈ నెల జీ తాలు విడుదల కాలేదని సమాచారం. ఒంగోలులో సుమారు 1,350మంది వరకు వార్డు వలంటీర్లు ఉం డగా, వారికి నెలనెలా అందే రూ. 5వేలు కూడా సకా లంలో ఇవ్వకపోడం కార్పొరేషన్‌ అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా కనిపిస్తున్నది. 


అధికారుల నిర్లక్ష్యంతోనే వేతన సమస్య 


కార్పొరేషన్‌లో పనిచేస్తున్న పర్మినెంట్‌ ఉద్యోగుల జీ తాల విషయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా సకాలం లో తమ వేతనాలు పొందిన ఉద్యోగులు సచివాలయ సెక్రటరీల వేతనాల విషయంలో తీవ్ర నిర్లక్ష్యం చూపా రని స్పష్టంగా తెలుస్తున్నది. ఇప్పటికే పర్మినెంట్‌ ఉద్యో గుల జీతాలు వారి ఖాతాల్లో జమ కాగా, వార్డు సెక్ర టరీల బిల్లులు విషయం ఎవరు పట్టించుకోకపోవడం దారుణం. ముఖ్యంగా గత నెల చివరి వారంలోనే బి ల్లులు పూర్తిచేసి, కమిషనరు తంబ్‌ వేయాల్సి ఉండగా, వ్యక్తిగత సెలవులో ఉన్న కారణంగా వేయలేదని కార్పొ రేషన్‌ కార్యాలయ ఉద్యోగులు వెల్లడిస్తున్నారు. మరోవై పు సిబ్బంది నిర్లక్ష్యంతో సెక్రటరీల శాలరీ బిల్స్‌ ప్రభు త్వానికి పంపగా, పలు లోపాలు కారణంగా ఆ బిల్లు లు తిరస్కరణకు గురైనట్లుగా సమాచారం.  


ఉద్యోగ భద్రతపై ఆందోళన.. 


ప్రభుత్వం మొదటి రెండేళ్లు రూ.15వేలు వేతనంగా ప్రకటించింది. ఆ తర్వాత మూడో సంవత్సరం నుంచి ప్రభుత్వ ఉద్యోగులుగా పర్మినెంట్‌ చేసి వేతనాలు పెం చుతామని చెప్పడంతో గంపెడాశతో ఉద్యోగాల్లో చేరా రు. అయితే నేటికి వారికి ఎలాంటి భద్రత, భరోసా ల భించకపోవడంతపై ఉద్యోగుల్లో నిరాశ నెలకొంది. ప్ర భుత్వ ఉద్యోగులుగా పలు ప్రాంతాల నుంచి ఇక్కడికి కుటుంబంతో వచ్చి విధుల్లో చేరిన పలువురు ఉద్యోగు లు తమకు వచ్చే జీతం సరిపోక అల్లాడుతున్నారు. పె రిగిన నిత్యావసర ధరలతో కుటుంబ జీవనం కష్టంగా మారిందని వాపోతున్నారు. ఇదిలా ఉండగా కొందరు నర్సింగ్‌ సెక్రటరీల భర్తలు కొవిడ్‌ కాలంలో ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇంటికి పెద్దదిక్కువగా ఉన్న నర్సింగ్‌ సెక్రటరీల పరిస్థితి మరింత దయనీయంగా మారింది.  ఉద్యోగంలో చేరినప్పుడు నియామకపత్రం లో రెండేళ్లు ప్రొబెషనరీ కాలంగా, ఆ తర్వాత పర్మి నెంట్‌ చేస్తామని ప్రభుత్వం పేర్కొంది. అయితే రెండే ళ్లు పూర్తయి మూడవ ఏడాదిలోకి అడుగు పెట్టినా నే టికి వారికి పర్మినెంట్‌ కాకపోవడంతో తీవ్ర నిరాశలో ఉన్నారు. అంతేగాకుండా మరోసారి పరీక్ష నిర్వహించి ప్రతిభను వెలికితీసి వారినే కొనసాగిస్తామని, అందు కు ఈ ఏడాది జూన్‌ వరకు గడువు ఇవ్వడంతో ఉద్యో గులందరూ అయోమయంలో పడ్డారు. 


Updated Date - 2022-04-24T05:47:53+05:30 IST