ప్రయాణికుల భద్రతే లక్ష్యం

ABN , First Publish Date - 2022-09-09T05:01:49+05:30 IST

ప్ర యాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా గమ్యస్థానాలకు చేర్చడమే లక్ష్యమని ఆర్టీసీ నెల్లూరుజోన్‌ ఈడీ ఆదాంసాహెబ్‌ అన్నారు.

ప్రయాణికుల భద్రతే లక్ష్యం

ఆర్టీసీ నెల్లూరు జోన్‌ ఈడీ ఆదాంసాహెబ్‌

పొదిలి, సెప్టెంబర్‌ 8 : ప్ర యాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా గమ్యస్థానాలకు చేర్చడమే లక్ష్యమని ఆర్టీసీ నెల్లూరుజోన్‌ ఈడీ ఆదాంసాహెబ్‌ అన్నారు. గురువారం స్థానిక డిపోలో ఆదర్శ ఉద్యోగుల అభినందన సభలో ఆ యన మా ట్లాడారు.  జిల్లా నడికూడలిలో ఉన్న పొదిలి డిపోకు మంచి గుర్తిం పు ఉంద న్నారు. సమయపాలన, బస్సు గమ్యస్థానం, భద్రతకు సిబ్బంది అధిక ప్రాధా న్యత ఇస్తున్నారన్నారు. ప్రయాణికులతో అన్యోన్యంగా ఉండి కుటుంబ సభ్యులుగా మెలగాలని సూచించారు. కండక్టర్‌, డ్రైవర్లు పంచసూత్రాలు పా టించాల్సిన అవసరం  ఉందన్నారు. ఇటీవల బస్సు చార్జీలు రెండు సార్లు పెం చి, ప్రయాణికులకు భారం పెరిగినా ఆర్టీసీ నష్టాల్లోనే ఉందన్నారు.  ప్రైవే టీకరణకు  పోటీ పడి బస్సులు నడపాల్సిన అవసరం ఉందన్నారు. ఆర్టీసీ బ స్సులో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. సిబ్బంది బాధ్యగా పనిచేసి ఆర్టీసీని లాభాలబాటలో నడిపించేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. కార్గో ద్వారా ఆదాయం పెంచేందుకు అవకాశాలు ఉ న్నాయని ఆదాంసాహెబ్‌ చెప్పారు. ఈ సందర్భంగా 2022లో అత్యధికంగా ఆయిల్‌ ఆదాయం చేసిన డ్రైవర్లు పి.మస్తాన్‌, బాబావలి పలువురు కండక్టర్లు, సిబ్బందిని శాలువాలతో సన్మానించారు.  ఈ సందర్భంగా ఆర్టీసీ  యూ నియన్‌ నాయకులు పలు సమస్యలను ఈడీ ఆదాంసాహెబ్‌ దృష్టికి తీసు కెళ్లారు. కార్యక్రమంలో ఒంగోలు ఆర్‌ఎం సుధాకరబాబు, నెల్లూరు జోన్‌ మాజీ డిప్యూటీ సీఎంఈ రవికాంత్‌, పొదిలి డిపో మేనేజర్‌ సుందరరావు పాల్గొన్నారు.


Read more