రోడ్డుకు రక్షణ చర్యలు

ABN , First Publish Date - 2022-10-12T03:40:35+05:30 IST

పర్చూరు - చీరాల ప్రధాన ఆర్‌అండ్‌బీ రహదారిలో రోడ్డుకు పడిన గండి ప్రాం తంలో ఏర్పాటు చేసిన ప్రమాద సూచికలను ఎస్‌ఐ జీవీ చౌదరి మంగళవారం పరిశీలించారు.

రోడ్డుకు రక్షణ చర్యలు
గండిపడిన ప్రాంతంలో ఏర్పాటు చేసిన సూచిక బోర్డులను పరిశీలిస్తున్న ఎస్‌ఐ

ప్రమాద సూచికల ఏర్పాటు

త్వరితగతిన  మరమ్మతులు చేస్తేనే  సమస్యకు పరిష్కారం

పర్చూరు, అక్టోబరు 11: పర్చూరు - చీరాల ప్రధాన ఆర్‌అండ్‌బీ రహదారిలో రోడ్డుకు పడిన గండి  ప్రాం తంలో ఏర్పాటు చేసిన ప్రమాద సూచికలను ఎస్‌ఐ జీవీ చౌదరి మంగళవారం పరిశీలించారు. గత కొన్ని రో జులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పర్చూరు వాగు  ఉధృతంగా ప్రవహిస్తోంది. వాగులోని నీరు రోడ్డు అం చుల వరకు చేరడంతో రోడ్డు మధ్యభాగంతో అంచులు కోతకు గురై ప్రమాదకరంగా మారింది. ఎప్పుడు ఎ లాంటి ప్రమాదం జరుగుతుందో అన్న విధంగా రహ దారి పరిస్థితి తయా రైంది. ఈతరుంలో ప్ర స్తుత చర్యల్లో భాగంగా గండి పడి దెబ్బతిన్న రోడ్డు ప్రాంతంలో ఎస్‌ ఐ ఆధ్వర్యంలో ప్రమా ద సూచిక బోర్డును ఏ ర్పాటు చేశారు. రో డ్డుకు త్వరిత గతిన మరమ్మతులు చే యిస్తేనే ప్రమాదాల నుంచి బయటపడగలమని ప్రజలు అంటున్నారు. వా గు ఉధృతంగా ప్రవహించడంతో ఎప్పుడు ఏం ప్రమాదం జరుగుతుందోనని వాహనదారుల్లో భయాం దోళన నెలకొంది. 


Updated Date - 2022-10-12T03:40:35+05:30 IST