-
-
Home » Andhra Pradesh » Prakasam » Response requests should be addressed promptly-NGTS-AndhraPradesh
-
స్పందన అర్జీలను సత్వరమే పరిష్కరించాలి
ABN , First Publish Date - 2022-06-07T06:50:01+05:30 IST
వివిధ రకాల సమస్యలపై ప్రజల నుంచివచ్చే అర్జీలను సత్వరమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లో సోమవారం డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం అనంతరం జరిగిన స్పందన కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు పలు రకాల సమస్యలను విన్నవించారు. అర్జీలను నిర్టిష్ట గడువులోపు పరిష్కరించాలన్నారు.

ఒంగోలు(కలెక్టరేట్), జూన్ 6 : వివిధ రకాల సమస్యలపై ప్రజల నుంచివచ్చే అర్జీలను సత్వరమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లో సోమవారం డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం అనంతరం జరిగిన స్పందన కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు పలు రకాల సమస్యలను విన్నవించారు. అర్జీలను నిర్టిష్ట గడువులోపు పరిష్కరించాలన్నారు. అర్జీల విషయంలో సంబంధిత అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకొని పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో పులి శ్రీనివాసులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు సరళావందనం, గ్లోరియా, నారదముని తదితరులు ఉన్నారు.
కొన్ని పరిస్థితుల కారణంగా కాలు తీసివేయడంతో ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్నానని, పింఛన్ మంజూరు చేసి ఆదుకోవాలని మర్రిపూడి మండలం ధర్మవరంకు చెందిన రాకేష్ కోరారు. ఆయన తన తల్లితో కలిసి జేసీకి వినతిపత్రం అందజేశారు. సదరమ్ సర్టిఫికెట్ కూడా తీసుకున్నామని,అందువల్ల న్యాయం చేసి అదుకోవాలని కోరారు.
మినీ గోకులం షెడ్డు నిర్మాణానికి సంబంధించిన డబ్బులు పూర్తి స్థాయిలో తనకు అందలేదని రాచర్లకు చెందిన కృష్ణమూర్తి ఫిర్యాదు చేశారు. డబ్బులు ఇప్పించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.
జలకళ పథకంద్వారా బోరు వేయించుకొని ఏడాది అవుతున్నా విద్యుత్‌కనెక్షన్ ఇవ్వడం లేదని సీఎ్‌సపురం మండలం వెంకటాచలంకు చెందిన రవి ఫిర్యాదు చేశారు.
ఓటీఎస్ కింద ప్రభుత్వానికి రూ. 10వేలు కట్టానని, ఇంతవరకు పట్టాకు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వలేదని కొండపికి చెందిన మణి అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు పలురకాల సమస్యలను విన్నవించారు.
పోలీసు స్పందనకు 59 ఫిర్యాదులు
ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను సత్వరం పరిష్కరించి ప్రజలకు జవాబుదారీగా ఉండాలని ఎస్పీ మలిక గర్గ్ పేర్కొన్నారు. సోమవారం స్థానిక పోలీసు కార్యాలయం ఆవరణలోని గెలాక్సీ మందిరంలో జరిగిన స్పందన కార్యక్రమంలో 59 మంది తమ ఫిర్యాదులను అందజేశారు.ఎస్పీ వారితో స్వయంగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. అదేసమయంలో సంబంధిత పోలీసు అధికారులతో కూడా మాట్లాడి చట్టపరిధిలో సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. అదే విధంగా అన్ని పోలీసు స్టేషన్లు, సర్కిల్ కార్యాలయాలు, సబ్‌డివిజన్ ఆఫీసుల్లో కూడా స్పందన ఫిర్యాదులు స్వీకరిస్తారని అర్జీదారులు సమీపంలో ఉన్న ప్రాంతాల్లో తమ వినతులు అధికారులకు ఇవ్వవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ కె.నాగేశ్వరరావు, ఎస్బీ డీఎస్పీ బి.మరియదాసు, ట్రాఫిక్ డీఎస్పీ పి. మల్లికార్జునరావు, దిశ డీఎస్పీ పల్లపురాజు, ఎస్పీ ఒన్ ఇన్స్పెక్టర్ రాఘవేంద్రరావు, లీగల్ అడ్వయిజర్ వేణుగోపాలరావు, ప్యానల్ అడ్వకేట్ బీవీ శివరామకృష్ట తదితరులు పాల్గొన్నారు.