తూర్పుగంగవరం - మాధవరం రోడ్డుకు మరమ్మతులు

ABN , First Publish Date - 2022-09-20T02:37:49+05:30 IST

మండలంలోని తూర్పుగంగవరం - మాధవరం గ్రామం వరకు అసంపూర్తిగా మిగిలిన బీటీ రోడ్డు మరమ్మతులు (ప్యాచ్‌వర్క్‌) జరుగుతున్నాయి.

తూర్పుగంగవరం - మాధవరం రోడ్డుకు మరమ్మతులు
మాధవరంలో ప్యాచ్‌ వర్క్‌ కింద తారు వేస్తున్న దృశ్యం

ఆంధ్రజ్యోతి కథనానికి స్పందన

తాళ్లూరు, సెప్టెంబరు 19 : మండలంలోని తూర్పుగంగవరం - మాధవరం గ్రామం వరకు అసంపూర్తిగా మిగిలిన బీటీ రోడ్డు మరమ్మతులు (ప్యాచ్‌వర్క్‌) జరుగుతున్నాయి. ఆ మార్గంలో గుంతలున్న ప్రాంతంలో కంకర తోలి కాంట్రాక్టర్‌ పనులు  అర్ధాంతరంగా నిలిపి వేయడంతో ఆగస్టు 19వ తేదీన ‘కంకరపై నడిపిస్తున్నారు’ అన్న కథనం ఆంధ్రజ్యోతిలో ప్రచురించింది. అధికార యంత్రాంగం స్పందించి గుంతలు పడ్డ ప్రాంతాలను కంకర్‌తో నింపి బీటీ రోడ్డు ప్యాచ్‌ వర్క్‌ పనులు చేస్తున్నారు. గతంలో గుంతలతో ఇబ్బందులు పడ్డ ప్రయాణికుల సమస్యలు రోడ్డు మరమ్మతుల వల్ల తొలగినట్లయ్యాయని ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


Read more