పాఠశాల నుంచి ఆర్బీకే తొలగింపు

ABN , First Publish Date - 2022-04-06T04:33:15+05:30 IST

మండలంలోని కేఎస్‌పల్లి ప్రాథమిక పాఠశాలలో నిర్వహిస్తున్న రైతు భరోసా కేంద్రాన్ని అధికారులు ఎట్టకేలకు తొలగించారు.

పాఠశాల నుంచి ఆర్బీకే తొలగింపు
ఉపాధ్యాయులకు పత్రాన్ని అందజేస్తున్న అధికారులు

‘ఆంధ్రజ్యోతి’కి కృతజ్ఞతలు

గిద్దలూరు టౌన్‌, ఏప్రిల్‌ 5 : మండలంలోని కేఎస్‌పల్లి ప్రాథమిక పాఠశాలలో నిర్వహిస్తున్న రైతు భరోసా కేంద్రాన్ని అధికారులు ఎట్టకేలకు తొలగించారు. హైకోర్టు అక్షితంలు వేసినా, ఐఎఎస్‌లకు శిక్ష విధించినా మారని  అధికారులు ఆంధ్రజ్యోతిలో కథనంపై వెంటనే స్పందించారు. కేఎస్‌పల్లిలో ని మండలపరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో నిర్వహిస్తున్న రైతు భరోసా కేంద్రానికి తాళాలు వేశారు. అందులో ఉన్న సామగ్రిని ఓ ప్రైవేటు భవనంలోకి మార్పు చేశారు. ఆర్బీకే కేంద్రాన్ని తీసివేశామని, ఈ గదిని పాఠశాలకు ఉపయోగించుకోవచ్చని ఈవోఆర్డీ చెన్నారావు, వ్యవసాయ, ఇంజనీరింగ్‌ విభాగాల అధికారులు పాఠశాల ఉపాధ్యాయులకు ఆమేరకు లేఖ ఇ చ్చారు. దాంతో పాఠశాల విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తూ ఆంధ్రజ్యోతికి కృతజ్ఞతలు తెలిపారు. అయితే రైతు భరోసా కేంద్రానికి వేసిన రంగులను మాత్రం ఇంకా తొలగించక పోవడం గమనార్హం.


Read more