200 బస్తాల రేషన్‌ బియ్యం పట్టివేత

ABN , First Publish Date - 2022-09-28T04:15:26+05:30 IST

మం డలంలోని రాజంపల్లిలో అక్ర మంగా నిల్వ చేసిన 200 బ స్తాల రేషన్‌ బియ్యాన్ని మంగళవారం రాత్రి జిల్లా విజిలెన్సు అధికారులు పట్టుకున్నా రు.

200 బస్తాల రేషన్‌ బియ్యం పట్టివేత
సీజ్‌ చేసిన రేషన్‌ బియ్యం

దర్శి, సెప్టెంబరు 27 : మం డలంలోని రాజంపల్లిలో అక్ర మంగా నిల్వ చేసిన 200 బ స్తాల రేషన్‌ బియ్యాన్ని  మంగళవారం రాత్రి జిల్లా విజిలెన్సు అధికారులు పట్టుకున్నా రు. రాజంపల్లి గ్రామ శి వారు దర్శి - పొదిలి రోడ్డులో గోడౌన్‌ లోగల శామియానా దుకా ణంలో రేషన్‌ బియ్యంను అక్ర మంగా నిల్వ ఉంచినట్లు విజిలెన్సు అధికారులకు సమాచారం అందింది. జిల్లా విజిలె న్సు ఏఎస్పీ శ్రీభవానీ హర్ష, డీఎస్పీ అశోక్‌ వర్ధన్‌, డీసీటీవో రామారావు, ఎన్‌ఫో ర్స్‌మెంట్‌ డీటీ షాజిదా హుటాహుటీన రాజంపల్లికి చేరుకుని గోడౌన్‌లో తనిఖీలు నిర్వహించగా అక్రమంగా నిల్వ చేసిన 200 బస్తాల రేషన్‌ బియ్యం పట్టుబడ్డాయి. ఈ రేషన్‌ బియ్యాన్ని ఎవరు నిల్వ చేశారు, ఏ ప్రాంతం నుంచి ఇక్కడకు తరలించారు అన్న విషయమై విజిలెన్సు అధికారులు సమాచారాన్ని సేకరిస్తున్నారు. పట్టుకున్న రేషన్‌ బియ్యాన్ని సీజ్‌ చేసి, కేసు నమోదు చేశారు. 


Read more