రమణయ్య హత్య కేసు విచారణ ముమ్మరం

ABN , First Publish Date - 2022-07-06T05:29:50+05:30 IST

మండలంలోని ఏకుం నాపురం గ్రామానికి చెందిన దాసరి వెంకటరమణయ్య హత్య కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు.

రమణయ్య హత్య కేసు విచారణ ముమ్మరం

పోలీసుల అదుపులో నలుగురు

వారిలో ముగ్గురు మైనర్‌ బాలురు

మరొకరు ఫీల్డ్‌ అసిస్టెంట్‌? 

సీఎస్‌పురం, జూలై 5 : మండలంలోని ఏకుం నాపురం గ్రామానికి చెందిన దాసరి వెంకటరమణయ్య హత్య కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. నలుగురు అనుమానితులను మంగళవారం అదుపు లోకి తీసుకున్నారు. వారిలో ముగ్గురు మైనర్‌ బాలురు ఉన్నట్లు సమాచారం. మిగిలిన ఒక్కరు అదేగ్రా మంలోని వైసీపీకి చెందిన ఉపాధి హామీ ఫీల్డ్‌ అసి౅ స్టంట్‌ అని తెలుస్తోంది. 

గతంలో ఫీల్డ్‌ అసిస్టెంట్‌ అక్రమాలపై జిల్లా అధి కారులకు రమణయ్య ఫిర్యాదు చేశాడు. దీంతో రమణ య్యపై ఫీల్ట్‌ అసిస్టెంట్‌, అతని తండ్రి కలిసి దాడి చేశారు. ఈ విషయమై పోలీస్‌ స్టేషన్‌లో వారిపై కేసు నమోదైంది. అప్పటి నుంచి రమణయ్యపై ఫీల్డ్‌ అసి స్టెంట్‌ కక్ష పెంచుకున్నాడు. గ్రామానికి చెందిన ము గ్గురు బాలురను రెచ్చగొట్టి ఆదివారం రమణయ్య పక్క గ్రామానికి రేషన్‌కు వెళ్లడాన్ని గమనించి దారి కాచి కర్రలు, రాళ్లతో కొట్టి హత్య చేసినట్లు తెలు స్తోంది. కనిగిరి నియోజకవర్గ ప్రజాప్రతినిధి సొంత సామాజిక వర్గానికి చెందిన వారే అనుమానితులుగా పోలీసుల అదుపులో ఉన్నారు. 

హత్య చేయడం దారుణం

అధికార పార్టీ నాయకుల అవినీతిపై ప్రశ్నించిన దళితుడు రమణయ్యను హత్య చేయడం దారుణమని ఎమ్మార్పీఎస్‌ మండల అధ్యక్షుడు జేపీ రాజు మాదిగ అన్నారు. హత్య చేసిన వారిని పోలీసులు వెంటనే గుర్తించి అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేసారు. 

కేసును నీరుగార్చేందుకు కుట్ర

హంతకులను మైనర్లుగా 

చిత్రీకరించేందుకు వైసీపీ నేతల యత్నం 

దళిత నేతలు

కనిగిరి : దాసరి రమణయ్య హత్య కేసును వైసీపీ నాయకులు నీరుగార్చేందుకు కుట్ర చేస్తున్నారని దళిత సంఘాల నేతలు ఆరోపించారు. మంగళవారం కనిగిరి ప్రభుత్వాసుపత్రిలో  రమణయ్య భౌతికఖాయానికి పో స్టుమార్టం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి వద్ద దళిత నేతలు మాట్లాడుతూ హత్య వెనుక ప్రభు త్వ కుట్ర ఉందన్నారు.  రాష్ట్రంలో దళితులకు రక్షణ కరువైందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ హత్యలో వైసీపీ నేతలు పాత్ర ఉందన్నారు. హత్యను నీరు గా ర్చేందుకు ఎమ్మెల్యే బుర్రా అండతో మైనర్లను కేసులో ఇరికించే యత్నం చేస్తున్నారని ఆరోపించారు. రమణయ్య హత్యకు కుట్ర చేసినవారిని, ఆర్థికంగా, రాజకీయంగా సహక రించిన వారిని అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. హత్య వెనుక ఫీల్డ్‌ అసిస్టెంట్‌ కేతనబోయిన శ్రీనివాసులు పాత్ర ఉందని వారు ఆరోపించారు. ప్రభుత్వం స్పం దించకుంటే హైకోర్టును ఆశ్రయిస్తామన్నారు. కార్య క్రమంలో దళితనేత నీలం నాగేంద్ర, పౌరహక్కుల సంఘం నాయకుడు పొటికలపూడి జయరాం, రిటైర్డ్‌ బ్యాంకు మేనేజర్‌ పాలేటి కోటేశ్వరరావు, దారా అం జయ్య, పేతురు, ప్రభుదాసు, రమణయ్య కుమారుడు దాసరి వెంకటకృష్ణ, బందువులు, దళితులు ఉన్నారు.


Read more