రాజకీయ కక్షతో పేదోడి పంట తొలగింపు అడ్డుకున్న కందుల

ABN , First Publish Date - 2022-04-06T04:52:59+05:30 IST

రాజకీయ కక్షతో శ్మశాన స్థలం ఆక్రమించారన్న ఫిర్యాదు మేరకు సాగులో ఉన్న బత్తాయి పంటను తొలగించేందుకు అధి కారులు మంగళవారం సిద్ధమయ్యారు.

రాజకీయ కక్షతో పేదోడి పంట తొలగింపు  అడ్డుకున్న కందుల
అధికారులతో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే కందుల

తర్లుపాడు, ఏప్రిల్‌ 5: రాజకీయ కక్షతో శ్మశాన స్థలం ఆక్రమించారన్న ఫిర్యాదు మేరకు సాగులో ఉన్న బత్తాయి పంటను తొలగించేందుకు అధి కారులు మంగళవారం సిద్ధమయ్యారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అక్కడకు చేరుకొని తొలగింపు ప్రయ త్నాలను అడ్డుకున్నారు. మండంలంలోని కేతగుడిపి పంచాయతీలోని బు డ్డపల్లెలో సర్వే నెంబర్‌ 291లో 7.88 ఎకరాల భూమిని బుడ్డపల్లె  శ్మశా నవాటికకు కేటాయించారు. ఆ పక్కనే ఉన్న బండారు ఆంజనేయులు సాగు చేస్తున్న భూమిలోకి శ్మశాన స్థలం 68 సెంట్లు కలిసింది. అయితే సుమారు 50 ఏళ్లు ఆంజనేయులు తన భూమిలో వ్యవసాయం చేస్తు న్నాడు. శ్మశాన స్థలం ఉందన్న విషయం కూడా బాధితుడు ఆంజ నే యులుకు తెలియదు. గ్రామానికి చెందిన కొందరు వైసీపీ నాయకులు ఎ లాగైనా ఆ భూమిని స్వాధీనం చేసుకోవాలలని అధికారులపై ఒత్తిడి తె చ్చారు. దీంతో మంగళవారం  తహసీల్దార్‌  బి.శ్రీనివాసులు, రెవెన్యూ సి బ్బంది శ్మశాన స్థలంలో సర్వే నిర్వహించారు. ఆక్రమణలో 68 సెంట్లు ఉన్నట్లు గుర్తించారు. దానిని తొలగించే ప్రయత్నం చేస్తుండగా కందుల, నాయకులు బాధితుడి తరఫున అడ్డుకున్నారు. 50ఏళ్లుగా సాగులో ఉన్న భూమిని ఎలా దున్నుతారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంత సేపు ఉధ్రిక్త పరిస్థితి నెలకొంది. మం డలంలోని అన్ని గ్రామాల్లోనూ ఆక్రమ ణలు తొలగించిన తర్వాతే ఈ భూమిని స్వాధీనం చేసుకోవాలని అధి కారులకు నాయకులు స్పష్టం చేశారు. దీంతో అధికారులు, పోలీసులు వెనక్కి వెళ్లారు.   కాసేప టి తర్వాత అధికార పార్టీ నుంచి తహసీ ల్దార్‌ కు ఫోన్‌ రావడంతో గంట తర్వాతవచ్చి స్థలంలో రాళ్లుపాతి వెళ్లారు. ఎస్‌ ఐ ముక్కంటి  బందోబస్త్‌ ఏర్పాటు చేశారు.


Read more