విష జ్వరాలతో వణుకుతున్న పూరిమెట్ల

ABN , First Publish Date - 2022-09-11T04:17:05+05:30 IST

విష జ్వరాలతో వణుకుతున్న పూరిమెట్ల

విష జ్వరాలతో వణుకుతున్న పూరిమెట్ల
జ్వరంతో మృతి చెందిన శ్రీదేవి (ఫైల్‌) జ్వరంతో మృతి చెందిన రవితేజ (ఫైల్‌)

రెండు వారాల వ్యవధిలో ఇద్దరి మృతి

ప్రతి ఇంట్లోనూ బాధితులే

ఆందోళనలో బంధువులు 

కోలుకోవడానికి లక్షల్లో ఖర్చు 

మూడు వందల మందికి పైగానే పీడితులు

ముండ్లమూరు, సెప్టెంబరు 10 : మండలంలోని పూరిమెట్ల గ్రామం విష జ్వరాలతో వణికిపోతోంది. గత 20 రోజుల నుంచి ఆ గ్రామంలో ప్రతి ఇంటిలోనూ ఒక రిద్దరు చొప్పున జ్వరంతో బాధపడుతున్నారు.  ఆర్‌ఎం పీల వద్ద చికిత్స పొందుతున్నా ఏ మాత్రం తగ్గక పోవ డంతో ప్రాణాలు కాపాడుకునేందుకు ఒంగోలు, అ ద్దంకి, వినుకొండ, మారెళ్ల ప్రైవేట్‌ ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. ఇప్పటికే ఈ గ్రామంలో రెండు వా రాల వ్యవధిలో చొప్పరపు శ్రీదేవి(27), మీసాల రవితేజ (24) విష జ్వరంతో పది రోజుల పాటు ఒంగోలులోని రెండు ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. అప్పటికే ఆ రెండు కుటుంబాల వారు వారిని కాపాడుకొనేందుకు  రూ.2 లక్షల వరకూ ఖర్చు చేశారు. దీంతో ఆ రెండు కుటుంబాల వారు ఆందోళన చెందారు. గ్రామంలో మైలా తిరుపతమ్మ, చొప్పరపు నాగార్జునతో మరో 300 మంది వరకూ జ్వరాలతో మం చం పట్టారు.  రెక్కాడితే గాని డొక్కాడని నిరు పేదల పై విష జ్వరాలు, డెంగ్యూ జ్వరాలు విజృంభించాయి. ప్రైవేట్‌ వైద్యుల వద్దకు వెళ్లి రక్త పరీక్షలు చే యించుకోగా తెల్ల రక్త కణాలు పడి పో యాయని చెప్పడం తో ఒక్కసారిగా బాధి త కుటుంబాల్లో ఆందో ళన మొదలైంది. పూరిమెట్ల గ్రామంలోని ఎస్సీ, బీసీ, ఓసీ ఏ రియాల్లో జ్వర పీడితులు అత్యఽ దిక మంది ఉన్నారు. ఒక్క ఎస్సీ కాలనీలోనే 50 మంది వరకు విష జ్వరంతో మూల్గుతున్నారు. ఇప్పటికే ఒక్కొక్కరూ రూ.10వేల నుంచి రూ.3 లక్షల వరకు వై ద్యం కోసం ఖర్చు పెట్టారు. పూరిమెట్లలో ఎక్కువ మంది కూలి పనికి వె ళితే గాని పూట గడవని నిరు పేదలు. ఆ గ్రామంలో 20 రోజులుగా జ్వరం వణికిస్తుండటంతో ఒక వైపు పనికి వెళ్లలేక మరో వైపు కుటుంబం గడవ లే క  ఇబ్బందు లు ఎదుర్కొంటున్నారు.  అధికారులు గ్రామాలను సందర్శించి గ్రామంలో జ్వర పీడితులకు మెరుగైన వైద్యం అందించాలని వేడుకుంటున్నారు. 

మెరుగైన వైద్యం అందించాలి

మా గ్రామంలో పెద్ద ఎత్తున విష జ్వరాలు సోకి మం చం పట్టారు. ఇప్పటికే గ్రామానికి చెందిన చొప్పరపు శ్రీదేవి, మీసాల రవితేజ విష జ్వరాలబారిన పడి మృతి చెందారు. అప్పటి నుంచి మా గ్రామంలో ఆందోళన మొదలైంది. వాస్తవానికి మా పంచాయతీలో పారిశుధ్యం ఎక్కడా లోపించ లేదు. వీధులన్నీ పరిశుభ్రంగానే ఉన్నాయి. సర్పంచ్‌ రామాంజీ ఇప్పటికే అనేక సార్లు పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించారు. ఐనా   విష జ్వరాలు ఎందుకు వస్తున్నాయో మాకు అర్థం కావడం లేదు. కూలికి వెళితే గాని పొట్ట గడవని నిరు పేదలను సైతం విష జ్వరాలబారిన పడి కోలుకునేందుకు వేల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఇప్పటికైనా సం బంధిత అధికారులు స్పందించి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి. 

- చింతపల్లి వెంకటేశ్వర్లు, ఎంపీటీసీ, పూరిమెట్ల


Read more