ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

ABN , First Publish Date - 2022-09-27T05:38:57+05:30 IST

ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర పర్యాట, సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు. అందుకోసం అనేక పథకాలు, కార్యక్రమాలను అమలు చేస్తున్నదని చెప్పారు. ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తున్నదన్నారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో రూ.2 కోట్లతో నిర్మించిన క్రీడా వికాస కేంద్రాన్ని సోమవారం ఆమె డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా, మరో మంత్రి ఆదిమూలపు సురేష్‌తో కలిసి ప్రారంభించారు.

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
క్రీడా వికాస కేంద్రాన్ని ప్రారంభిస్తున్న రోజా పక్కన డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా, మంత్రి సురేష్‌

రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి రోజా

ఎర్రగొండపాలెం, సెప్టెంబరు 26 : ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర పర్యాట, సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు. అందుకోసం అనేక పథకాలు, కార్యక్రమాలను అమలు చేస్తున్నదని చెప్పారు. ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తున్నదన్నారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో రూ.2 కోట్లతో నిర్మించిన క్రీడా వికాస కేంద్రాన్ని సోమవారం ఆమె డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా, మరో మంత్రి ఆదిమూలపు సురేష్‌తో కలిసి ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో మాట్లాడారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్న సంకల్పంతోనే మూడు రాజధానులు కడతామంటే అమరావతి రైతులు కోర్టు ఆర్డర్‌తో యాత్ర చేపట్టారన్నారు.  అనంతరం పొదుపు సంఘాలకు బ్యాంకి లింకేజీ,, స్త్రీ నిధి చెక్కులను, అంగన్‌వాడీ కార్యకర్తలకు సెల్‌ఫోన్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ, కలెక్టర్‌ దినేష్‌కుమార్‌, ఆర్డీవో లక్ష్మీశివజ్యోతి, డీఆర్‌డీఏ పీడీ బాబురావు, సీడీపీవో ఎం.పద్మావతి, తహసీల్దార్‌ రవీంద్రారెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ ఉడుముల శ్రీనివాసరెడ్డి, ఎంపీపీ కిరణ్‌గౌడ్‌. జడ్పీటీసీ సభ్యుడు విజయభాస్కర్‌, మాజీ ఏఎంసీ చైర్మన్‌ ఒంగోలు మూర్తిరెడ్డి, సర్పంచ్‌ ఆర్‌. అరుణాబాయ్‌, ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్లు, పంచాయతీ కార్యదర్శి రాజశేఖరరెడ్డి, మండల లెవెల్‌ అధికారులు పాల్గొన్నారు.


Updated Date - 2022-09-27T05:38:57+05:30 IST