ఘనంగా శివాజీ జయంతి

ABN , First Publish Date - 2022-02-20T04:29:31+05:30 IST

ఛత్రపతి శివాజీ జయంతిని శనివారం ఘనంగా నిర్వహిం చారు. స్థానిక పట్టాభివీధిలో మరాఠ సంఘం నాయకుల ఆధ్వర్యంలో ఛత్రపతి సేవా ట్రస్ట్‌ ఏర్పాటు చేశారు.

ఘనంగా శివాజీ జయంతి
శివాజీ చిత్రపటానికి నివాళులర్పిస్తున్న మాజీ ఎమ్మెల్యే కందుల

మార్కాపురం(వన్‌టౌన్‌), ఫిబ్రవరి 19: ఛత్రపతి శివాజీ జయంతిని శనివారం ఘనంగా నిర్వహిం చారు. స్థానిక పట్టాభివీధిలో మరాఠ సంఘం నాయకుల ఆధ్వర్యంలో ఛత్రపతి సేవా ట్రస్ట్‌ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శివాజీ చిత్రపటానికి మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పూల మా లలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ షేక్‌ ఇస్మాయిల్‌, నియోజకవర్గ జనసేన అధ్యక్షుడు ఇమ్మడి కాశీనాథ్‌, మారాఠ సేవా సంఘం నాయకులు గైకోటి వెంకటరవి తదితరులు పాల్గొన్నారు. ఉచిత వైద్య శిబిరం అన్నదానం ఏర్పాటు చేశారు. సాయంత్రం పట్టణ వీధులలో మార్కాపురం మరాఠ సంఘం, హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో శివాజీ చిత్రపటాన్ని ఊరేగింపుగా తీసుకెళ్లి శోభాయాత్ర నిర్వహించారు. కార్యక్రమంలో మరాఠ సంఘం నాయకులు గైకోటీ భుజంగరావు, జె.రాంభూల్‌రావు, కె.శ్రీనివాసరావు, వెంకటసుబ్బయ్య, హిందూ చైతన్య వేదిక నాయ కులు జె.వాసు, టి.వెంకటేశ్వర్లు  పాల్గొన్నారు.


Read more