చంద్రబాబును అడ్డుకోవడంపై నిరసనాగ్రహం

ABN , First Publish Date - 2022-08-26T04:58:08+05:30 IST

రాష్ట్రంలో వైసీపీ దు ర్మార్గపు పాలన సాగుతోందని తెలుగదేశం పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి.

చంద్రబాబును అడ్డుకోవడంపై నిరసనాగ్రహం

 కుప్పం ఘటనపై ఒంగోలులో ఆందోళన

ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద రాస్తారోకో 

 

ఒంగోలు(కార్పొరేషన్‌), ఆగస్టు 25: రాష్ట్రంలో వైసీపీ దు ర్మార్గపు పాలన సాగుతోందని తెలుగదేశం పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. కుప్పంలో పార్టీ అధినేత చంద్ర బాబునాయుడు సొంత నిధులతో పేదల ఆకలి తీర్చడానికి ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్‌ను గురువారం వైసీపీ నా యకులు అడ్డుకున్న ఘటనపై ఒంగోలులో తెలుగుదేశం పార్టీ శ్రేణులు నిరసన తెలియజేశాయి. స్థానిక ఎన్టీఆర్‌ భ వనం నుంచి అద్దంకి బస్టాండ్‌సెంటర్‌లోని ఎన్టీఆర్‌ వి గ్రహం వరకు నల్లబ్యాడ్జీలు, నల్లజెండాలతో నిరసన ర్యాలీ  నిర్వహించారు. రోడ్డుపై బైటాయించి రాస్తారో చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీడీపీ హాయంలో పేద లకు రూ.5లకే ఆకలి తీర్చడానికి అన్న క్యాంటీన్‌లు ఏర్పా టు చేస్తే జగన్‌రెడ్డి ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించి వాటిని తొలగించడం దారుణమన్నారు. మూడేళ్ళుగా క్యాం టీన్లు మూతవేసి పేదల కడుపు కొట్టి పబ్బం గడుపుకుం టున్న వైసీపీ పేదల వ్యతిరేకిగా పనిచేస్తుందని విమర్శిం చారు. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని అనడానికి వై సీపీ నేతల దాడులు, అక్రమ కేసులు, అడ్డగింతలే నిద ర్శనమని వారు ఆరోపించారు. పేదల ఆకలిని గుర్తించిన తమ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన సొంత నిధులతో కుప్పంలో అన్నక్యాంటీన్‌ ఏర్పాటు చేస్తే దానిని ధ్వంసం చేయడమే కాకుండా, చంద్రబాబును అ డ్డుకోవడం పిరికిపంద చర్యన్నారు. ప్రజాదరణ తగ్గడంతో వైసీపీకి ఓటమి భయం పట్టుకుందని చెప్పారు. దీంతో ప్ర జాదరణ కలిగిన టీడీపీ శ్రేణులను ఇబ్బందులకు గురిచే యడమే లక్ష్యంగా పెట్టుకుందని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాగా టీడీపీ చేపట్టిన నిరసన కార్యక్ర మాన్ని పోలీసులు అడ్డగించడంతో పార్టీ శ్రేణులు, పోలీ సుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఆందోళన విర మించాలని పోలీసులు అడ్డుకోవడంతో కొంత ఉద్రిక్త పరిస్థి తి నెలకొంది. కార్యక్రమంలో నగర అధ్యక్షుడు కొఠారి నాగే శ్వరరావు, తెలుగు యువత అధ్యక్షుడు ముత్తన శ్రీనివాస రావు, జి.రాజ్‌విమల్‌, తెలుగు మహిళ రాష్ట్ర ఉపాధ్యక్షురా లు ఆర్ల వెంకటరత్నం, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నా ళం నరసమ్మ, తెలుగు మహిళ ఒంగోలు పార్లమెంట్‌ రా వుల పద్మజ, ప్రధాన కార్యదర్శి బీరం అరుణ, పెద్ద సంఖ్య లో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Read more