-
-
Home » Andhra Pradesh » Prakasam » Proceedings for sanction of bills-MRGS-AndhraPradesh
-
బిల్లుల మంజూరుకు చర్యలు
ABN , First Publish Date - 2022-10-12T03:47:38+05:30 IST
వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ చీరాల ఏఎస్ డబ్ల్యూవో పరిధిలో పెండింగ్‌లో ఉన్న అన్ని రకాల బిల్లులు మంజూరుకు తగిన చర్యలు చేప ట్టేందుకు చ ర్యలు చేపట్టాని ఏఎస్‌డబ్ల్యూవో సబితారాణి మంగళ వారం ప్రకటనలో తెలిపారు.

చీరాల, అక్టోబరు 11 : వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ చీరాల ఏఎస్ డబ్ల్యూవో పరిధిలో పెండింగ్‌లో ఉన్న అన్ని రకాల బిల్లులు మంజూరుకు తగిన చర్యలు చేప ట్టేందుకు చ ర్యలు చేపట్టాని ఏఎస్‌డబ్ల్యూవో సబితారాణి మంగళ వారం ప్రకటనలో తెలిపారు. ఈ నెల 8వ తేదీన ఆంధ్య్రజ్యోతి దిన పత్రికలో వార్డెన్ల వెతలు అన్న శీర్షికన ప్రచురితమైన కథనంపై ఆ మె స్పందించారు. తాను జూలై 18వ తేదీన బదిలీపై మదనపల్లి బీసీ సంక్షేమ క్యార్యాలయం నుంచి చీరాల వచ్చాను. సాంకేతిక కారణా లతో బి ల్లులు మంజూరు చేసేందుకు అవస రమైన బయో మెట్రిక్ అథంటికేషన్ రాలేదు. దీంతో కొంత మేర జీతాలు, బిల్లులు పెం డింగ్‌లో పడ్డాయి. ఈ నెల 7వ తేదీన బయోమెట్రిక్ అథం టికేషన్ మంజూరయింది. ఈ నేప థ్యంలో చీ రాల పరిధిలోని అన్ని పెం డింగ్ బిల్లులు సకాలంలో మంజూరు చేసేందుకు మార్గం సుగమమైందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.