-
-
Home » Andhra Pradesh » Prakasam » Prisoners must be treated with good conduct-NGTS-AndhraPradesh
-
ఖైదీలు సత్ప్రవర్తనతో మెలగాలి
ABN , First Publish Date - 2022-04-24T07:48:47+05:30 IST
ఖైదీలు సత్ప్రవర్తనతో మెలగాలని దర్శి సీనియర్ సివిల్ జడ్జీ జీఎల్‌వీ ప్రసాదు సూచించారు. స్థానిక సబ్ జైలులో శనివారం నిర్వహించిన న్యాయ అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు.

దర్శి, ఏప్రిల్ 23 : ఖైదీలు సత్ప్రవర్తనతో మెలగాలని దర్శి సీనియర్ సివిల్ జడ్జీ జీఎల్‌వీ ప్రసాదు సూచించారు. స్థానిక సబ్ జైలులో శనివారం నిర్వహించిన న్యాయ అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. క్షనికావేశంలో చేసిన తప్పులతో ఖైదీలుగా శిక్షలు అనుభవించాల్సి వస్తోందన్నారు. విడుదలైన తర్వాత ప్రశాంత వాతావరణంలో జీవించాలన్నారు. కార్యక్రమంలో జైలు సూపరిండెంట్ వెంకటరమణ, న్యాయవాదులు చెన్నకేశవులు, సురేష్ ఖైదీలు పాల్గొన్నారు.
గిద్దలూరు టౌన్ : చట్టాలపై అవగాహనతోనే ప్రతి ఒక్కరూ ప్రశాంత జీవితాన్ని కలిగి ఉంటారని జూనియర్ సివిల్ జడ్జి బి.రాజేష్ అన్నారు. శనివారం విజయ కోఆపరేటివ్ జూనియర్ కాలేజీలో న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. సుప్రీంకోర్టు, హైకోర్టు, జిల్లా కోర్టు ఆదేశాల మేరకు న్యాయవిజ్ఞాన సదస్సులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సంవత్సర ఆదాయం రూ.3 లక్షల లోపు ఉన్న వారు, మహిళలు, భిక్షాటన చేసేవారికి ఉచిత న్యాయం అందిస్తామన్నారు. ప్రతి ఒక్కరూ చట్టాలకు లోబడి ఉండాలన్నారు. ప్రస్తుతం ర్యాగింగ్ యాక్ట్ అమలులో ఉందని, విద్యార్థులు ర్యాగింగ్‌కు పాల్పడితో వెంటనే కళాశాల యాజమాన్యానికి తెలపాలన్నారు. 6 నెలల జైలు, రూ.1000 జరిమానా ఉంటుందని జడ్జి రాజేష్ హెచ్చరించారు. కార్యక్రమంలో న్యాయవాదులు సత్యసులోచన, పిచ్చయ్యనాయుడు, సిద్దయ్య, కళాశాల డైరెక్టర్లు విక్టర్‌పాల్, వెంకటేశ్వర్లు, భాషా, అక్బర్, పారాలీగల్ వలంటీర్ మధుసూదన్‌రావు పాల్గొన్నారు.