రాజకీయ నాయకుల కుట్రలో పోలీసులు

ABN , First Publish Date - 2022-08-17T05:46:43+05:30 IST

కొందరు రాజకీయ నాయకుల చేసిన కుట్రలో పోలీ సులు భాగస్వాములు అయ్యి తనను అంతమొందించేందుకు ప్రయత్నం చేస్తు న్నారని సోమిశెట్టి సుబ్బారావు గుప్తా మంగళవారం ఒంగోలులో ఎస్పీ మలిక గర్గ్‌కు ఫిర్యాదు చేశారు.

రాజకీయ నాయకుల కుట్రలో పోలీసులు

తనను అంతమొందించేందుకు యత్నం 

ఎస్పీకి గుప్తా ఫిర్యాదు 


ఒంగోలు(క్రైం), ఆగస్టు16: కొందరు రాజకీయ నాయకుల చేసిన కుట్రలో పోలీ సులు భాగస్వాములు అయ్యి తనను అంతమొందించేందుకు ప్రయత్నం చేస్తు న్నారని సోమిశెట్టి సుబ్బారావు గుప్తా మంగళవారం ఒంగోలులో ఎస్పీ మలిక గర్గ్‌కు ఫిర్యాదు చేశారు. ఒంగోలు ఎమ్మెల్యే, ఆయన తనయుడు, వ్యక్తిగత కార్యద ర్శి కలిసి తనను అంతమొందించేందుకు కుట్ర చేశారన్నారు. అందుకు ఒక డీ ఎస్పీ, ముగ్గురు సీఐలు ప్రణాళిక రూపొందించి తాను ఎక్కడ ఉన్నానో కూడా రా జకీయ నాయకులకు చెప్పి దాడి చేయించారని వివరించారు. అంతేగాకుండా ఇ టీవల ఆ ఎమ్మెల్యే తనమీద తప్పుడు కేసులు పెట్టించేందుకు కూడా ప్రణాళిక రూపొందించారని వాపోయాడు. ఈ మేరకు విచారణ జరిపి తనకు న్యాయం చే యాలని ఎస్పీని కోరారు.


Read more