ఎకోటూరిజాన్ని సందర్శించిన పీసీసీఎఫ్‌

ABN , First Publish Date - 2022-10-05T05:16:14+05:30 IST

మండలంలోని తుమ్మలబైలు వద్ద ఉన్న ఎకోటూరిజంను బడ్జెట్టు పీసీసీఎఫ్‌ ఆర్‌కె సుమన్‌ మంగళవారం సందర్శించారు.

ఎకోటూరిజాన్ని సందర్శించిన పీసీసీఎఫ్‌
విల్లు ఎక్కు పెడుతున్న సుమన్‌

పెద్ద దోర్నాల, అక్టోబరు 4: మండలంలోని తుమ్మలబైలు వద్ద ఉన్న ఎకోటూరిజంను బడ్జెట్టు పీసీసీఎఫ్‌ ఆర్‌కె సుమన్‌ మంగళవారం సందర్శించారు. ఆయన కుటుంబసభ్యులతో శ్రీశైలం దైవదర్శనానంతరం ఇష్టకామేశ్వరీ దేవాలయం, ఎకోటూరిజాన్ని సందర్శించి అటవీశాఖ సిబ్బందితో అటవీ పరిరక్షణపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అటవీ సంపద జాతి సొత్తు అని పరిరక్షించుకోవడం అందరి బాధ్యతన్నారు. రేంజి అధికారి విశ్వేశ్వరరావు పాల్గొన్నారు.

అటవీ సంరక్షణ అందరి బాధ్యత

గిద్దలూరు టౌన్‌ : వన్యప్రాణుల సంరక్షణతోపాటు అటవీ సంరక్షణ అందరి బాధ్యత అని అటవీశాఖ అధికారులు పేర్కొన్నారు. వన్యప్రాణుల వారోత్సవాలు, అటవీ సంరక్షణ అనే అంశాలపై మండలంలోని ఉయ్యాలవాడ గ్రామంలో అవగాహన సదస్సు నిర్వహించారు. వనసంరక్షణ సమితి సభ్యులు, ప్రజలు సమావేశానికి హాజరయ్యారు. సంజీవరాయునిపేట సెక్షన్‌ డిప్యూటీ రేంజ్‌ ఆఫీసర్‌ బాలాజీనాయక్‌ మాట్లాడుతూ వన్యప్రాణులను హింసించిన, చంపినా చట్టాలు కఠినంగా ఉంటాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో కొత్తకోట సెక్షన్‌ ఆఫీసర్‌ ఇంద్రసేనారెడ్డి, బీట్‌ ఆఫీసర్లు బాలకృష్ణ, అంకయ్య, చంద్రరెడ్డి పాల్గొన్నారు. 

Read more