పారిశుధ్య కార్మికులకు బకాయిలను చెల్లించాలి

ABN , First Publish Date - 2022-09-18T04:35:11+05:30 IST

గ్రామాల్లో స్వచ్ఛభారత్‌ కార్యక్రమంలో భాగస్వాములవుతున్న పారిశుధ్య కార్మికులకు వేతన బకాయిలను వెంటనే చెల్లించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎం.రమేష్‌ డిమాండ్‌ చేశారు. శనివారం స్థానికంగా నిర్వహించిన మండల స్థాయి పారిశుధ్య కార్మికుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్మికులకు 20 నెలలుగా వేతనాలు చెల్లించకపోతే కుటుంబాలను ఎలా పోషించుకోవాలని ప్రశ్నించారు. విధి నిర్వహణలో గాయపడిన మర్రిపూడిలోని పారిశుధ్య కార్మికుడు నరసయ్యకు వైద్యానికి అయిన ఖర్చును ప్రభుత్వం చెల్లించాలని ఆయన కోరారు.

పారిశుధ్య కార్మికులకు బకాయిలను చెల్లించాలి
సమావేశంలో మాట్లాడుతున్న రమేష్‌

సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రమేష్‌

మర్రిపూడి, సెప్టెంబరు 17 : గ్రామాల్లో  స్వచ్ఛభారత్‌ కార్యక్రమంలో భాగస్వాములవుతున్న పారిశుధ్య కార్మికులకు వేతన బకాయిలను వెంటనే చెల్లించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎం.రమేష్‌ డిమాండ్‌ చేశారు. శనివారం స్థానికంగా నిర్వహించిన మండల స్థాయి పారిశుధ్య కార్మికుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్మికులకు 20 నెలలుగా వేతనాలు చెల్లించకపోతే కుటుంబాలను ఎలా పోషించుకోవాలని ప్రశ్నించారు. విధి నిర్వహణలో గాయపడిన మర్రిపూడిలోని పారిశుధ్య కార్మికుడు నరసయ్యకు వైద్యానికి అయిన ఖర్చును ప్రభుత్వం చెల్లించాలని ఆయన కోరారు. పారిశుధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఈనెల 20న ఒంగోలులోని కలెక్టర్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.  పెద్దకోటయ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో దాసరి ఇమ్మానియేల్‌, ఎం.బసవయ్య, జి.శ్రీను, ఎం.నరసయ్య, జేమ్స్‌, ఎ.నరసింహులు పాల్గొన్నారు. 


టంగుటూరులో.. 

టంగుటూరు : పంచాయతీల్లో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఈనెల 20న ఒంగోలులోకి కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్లు సీఐటీయూ జిల్లా కార్యదర్శి గంటెనపల్లి శ్రీనివాసరావు తెలిపారు. కార్మికులు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని కోరారు. శనివారం టంగుటూరు పంచాయతీ కార్యాలయం వద్ద నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నిత్యావసర సరుకుల ధరలు పెరిగిన నేపథ్యంలో పంచాయతీ కార్మికులకు నెలకు రూ.26వేల వేతనం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. జీవో నెం.551ని తక్షణమే అమలు చేయాలన్నారు. సమావేశంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి టంగుటూరి రాము, మండల కార్యదర్శి మోజెస్‌ తదితరులు పాల్గొన్నారు.

 

Updated Date - 2022-09-18T04:35:11+05:30 IST