మూడు ముక్కలే!

ABN , First Publish Date - 2022-04-06T05:06:15+05:30 IST

ఉమ్మడి ప్రకాశం జిల్లా మూడు ముక్కలయ్యింది. ఐదు దశాబ్దాల పైబడిన అనుబంఽధం తెగిపోయింది. గత సోమవారం నుంచి ఎక్కడ పాలన అక్కడే ప్రారంభమైంది. సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాల్లోనూ మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఆర్థికపరమైన వనరులూ చెల్లాచెదురయ్యాయి. ప్రధాన రాజకీయపార్టీలైన వైసీపీ, టీడీపీలో యువతరం నాయకత్వానికి ప్రాధాన్యత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఆయా పార్టీల పరిస్థితులకు అనుగుణంగా కొన్ని ప్రాంతాల నాయకత్వంలో మార్పులు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మూడు ముక్కలే!

విభజనతో తెగిపోయిన ఐదు దశాబ్దాల అనుబంధం

సామాజిక, ఆర్థిక వ్యవహారాల్లో జిల్లా వెనుకబడే అవకాశం

రాజకీయంగానూ తగ్గనున్న ప్రభావం

టీడీపీ, వైసీపీలలో మారనున్న ప్రాధాన్యతలు


ఉమ్మడి ప్రకాశం జిల్లా మూడు ముక్కలయ్యింది. ఐదు దశాబ్దాల పైబడిన అనుబంఽధం తెగిపోయింది. గత సోమవారం నుంచి ఎక్కడ పాలన అక్కడే ప్రారంభమైంది. సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాల్లోనూ మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఆర్థికపరమైన వనరులూ చెల్లాచెదురయ్యాయి. ప్రధాన రాజకీయపార్టీలైన వైసీపీ, టీడీపీలో యువతరం నాయకత్వానికి ప్రాధాన్యత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఆయా పార్టీల పరిస్థితులకు అనుగుణంగా కొన్ని ప్రాంతాల నాయకత్వంలో మార్పులు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. 


(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)

ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రకారం వైసీపీ ప్రభుత్వం జిల్లాల విభజనను పూర్తిచేసింది. ప్రజల అవసరాలు, ఆకాంక్షలు చివరికి అధికార పార్టీ నేతల అభిప్రాయాలను కూడా పట్టించుకోకుండా జిల్లాను మూడు ముక్కలు చేసింది.  ఆ ప్రకారం ఒంగోలు కేంద్రంగా ప్రకాశం జి ల్లా, బాపట్ల కేంద్రంగా బాపట్ల జిల్లా, నె ల్లూరు కేంద్రంగా నెల్లూరు జిల్లాల పాలన గత సోమవారం నుంచి ప్రారంభమైంది. కొత్త రూపురేఖలు చూస్తే ఉమ్మడి జిల్లాలో ని అద్దంకి నియోజకవర్గంలో ఉన్న బ్లాక్‌గ్రానైట్‌ నిక్షేపాల ప్రాంతమంతా బాపట్ల జిల్లాలోకి వెళుతుంది. యాభైకిపైగా క్వారీలు వందలాది గ్రానైట్‌ ఫ్యాక్టరీలతో విరాజిల్లుతున్న ఆ ప్రాంతం ద్వారా వచ్చే ఆర్థికవనరులన్నీ ఆ జిల్లాలో కి పోనున్నాయి. అలాగే చినముంబాయిగా పేరొందిన చీరాలలోని చేనేతరంగమంతా ఆ జిల్లాలోకి వెళ్లింది. సాగర్‌ కాలువ పరిధిలో ఉన్న ఏబీసీ, కొమ్మమూరు కాలువల ఆధారంగా వ్యవసాయానికి ప్రత్యేకంగా పేరొందిన పర్చూరు ప్రాంతం కూడా బాపట్ల జిల్లాలో కలిసింది. కందుకూరు నియోజకవర్గం నెల్లూరు జిల్లాలో కలవటం ద్వారా చారిత్రాత్మమైక రాళ్లపాడు ప్రాజెకు,్ట జిల్లాలో పొగాకు సాగు కు వన్నెతెచ్చిన ప్రాంతంలో కొంతభాగం నెల్లూరు జిల్లాలో చేరింది.. వీటికి తోడు యావత్తు జిల్లా ప్రజలు సాధించుకున్న రామాయపట్నం ఓడరేవు ప్రాంతం కూడా నెల్లూరు జిల్లాలో కలిసింది. ఉమ్మడి ప్రకాశం జిల్లా మొత్తానికి ఉపయోగపడుతుందనుకున్న ఈ ఓడరేవు దాని అనుంబంధంగా పరిశ్రమలు ఏర్పడే ప్రాంతం కూడా నెల్లూరు జిల్లాకి వెళ్లిపోయింది. 


రాజకీయంగానూ మసకే

రాజకీయంగా కూడా జిల్లా ప్రాధాన్యత మసకబారే అవకాశం ఉంది. 1970లో జిల్లా ఏర్పడే నాటికి సీమ నుంచి జిల్లాలో కలిసిన మార్కాపురం డివిజన్‌లోను, నెల్లూరు జిల్లా నుంచి కలిసిన కందుకూరు డివిజన్‌ ప్రాంతం, గుంటూరు జిల్లా నుంచి కలిసిన ఒంగోలు డివిజన్‌ ప్రాంతంలోను పలువురు నాయకులు రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొంది ఉన్నారు. ఆయా ప్రాంతాలు కలిపి జిల్లా ఏర్పాటుచేసిన తరువాత వయస్సు, ఇతర అంశాల దృష్ట్యా వారి ప్రాధాన్యం తగ్గి కొత్త నాయకత్వం తెరపైకి వచ్చింది. వారందరూ నిలదొక్కుకునే క్రమంలో జిల్లాలో రాజకీయ నాయకులకు ప్రాధాన్యం తగ్గి అనేక అంశాల్లో జిల్లాకు రావాల్సిన వనరులు రాక, అటు కర్నూలు, ఇటు నెల్లూరు మరోవైపు గుంటూరు జిల్లాలకు లభించిన రాజకీయ ప్రాధాన్యం ప్రకాశం జిల్లాకు రావటానికి 40ఏళ్లకుపైగా పట్టింది. రాష్ట్ర విభజన అనంతరం జిల్లాలో నాయకులకు ప్రాధాన్యం పెరిగింది. రాజకీయంగానూ జిల్లాకు అంతోఇంతో న్యాయం జరుగుతోంది. ప్రస్తుతం జిల్లాల విభజన నేపథ్యంలో ప్రధాన పార్టీల నాయకత్వం ఆయా జిల్లాల వారీగా విభజనకు గురైంది.


బలమైన నాయకత్వం పక్కకు..

ప్రస్తుత జిల్లా పరిస్థితులను చూస్తే టీడీపీలో ముఖ్యనాయకత్వం జిల్లాలకు అనుగుణంగా విభజనకు గురైంది. కొత్తగా ఏర్పడిన బాపట్ల జిల్లాలో ఆపార్టీకి బలమైన నాయకత్వం లభించింది. బాపట్ల జిల్లాలో కలిసిన అద్దంకి, పర్చూరు ఎమ్మెల్యేలు ఆపార్టీ వారే. ఇటీవల యావత్తు జిల్లా టీడీపీ వ్యవహారాల్లో వారు కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇక వైసీపీ వ్యవహారానికి వస్తే ఆ జిల్లాలో కలిసిన ప్రాంతాలకు చెందిన ఇద్దరు సీనియర్‌ నాయకులు కరణం బలరాం, బాచిన చెంచుగరటయ్యలు ఆ పార్టీలో ఉన్నారు. ఆ పార్టీ యువ నాయకత్వాన్ని ప్రోత్సహించే క్రమంలో అద్దంకి నుంచి బాచిన కృష్ణచైతన్య, చీరాల నుంచి వెంకటేష్‌ యాక్టివ్‌గా ఉన్నారు.  ఏదిఏమైనా బాపట్ల జిల్లాలో టీడీపీలో సీనియర్‌ నాయకులు, వైసీపీలో యువనాయకులు కీలకపాత్ర పోషించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రకాశంలో మంత్రి బాలినేని, సురే్‌షకు తప్ప వైసీపీలో ఉన్న ఎమ్మెల్యేలంతా ఆ పార్టీలోను, రాజకీయంగా కూడా జూనియర్లే. టీడీపీలో ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల, కనిగిరి నుంచి ఉగ్రనరసింహారెడ్డిలకు రాష్ట్రస్థాయిలో మంచి గుర్తింపు ఉంది. కొండపి ఎమ్మెల్యే స్వామి పాత్ర కీలకమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఏదిఏమైనా జిల్లా మూడు ముక్కలు కావటంతో ఆర్థిక వనరులు చిన్నాభిన్నం కావటమేకాక రాజకీయ వ్యవహారాల్లోను ప్రకాశం జిల్లా ఆధిపత్యం తగ్గే అవకాశం కనిపిస్తోంది.


పూర్తిగా వెనుకబడిన ప్రాంతం

విభజన అనంతరం ప్రకాశం జిల్లా విషయాన్ని పరిశీలిస్తే ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలు ఇందులో ఉంటున్నాయి. వాటిలో ఐదు పశ్బిమప్రాంత నియోజకవర్గాలు పూర్తిగా వెనుకబడినవి. అక్కడున్న పలకల క్వారీల పరిస్థితి ప్రస్తుతం పేరుగొప్ప ఊరుదిబ్బ అన్నచందంగా మారింది. యాభై ఏళ్ల అనంతరం కూడా వెలిగొండ ప్రాజెక్టు అదిగోఇదిగో అనే స్థాయిలోనే ఉంది. తూర్పు ప్రాంతానికి వస్తే చీమకుర్తి గెలాక్సీ గ్రానైట్‌ ప్రాంతమే ప్రకాశం జిల్లాకు ప్రధాన ఆదాయనవరుగా చెప్పుకోవచ్చు. మరోవైపు 102 కిలోమీటర్లు తీరప్రాంతాన్ని పరిశీలిస్తే అరవైశాతం ఇతర జిల్లాల్లోకి వెళ్లింది. అందులో ప్రధానమైన చీరాల ప్రాంతం బాపట్ల జిల్లాలో చేరింది. రామాయపట్నం ప్రాంతం నెల్లూరు జిల్లా పరిధిలోకి వెళ్లింది. 

Updated Date - 2022-04-06T05:06:15+05:30 IST