ప్రతి వంద ఓటర్లకు ఒక ఇన్‌చార్జి

ABN , First Publish Date - 2022-09-29T03:50:36+05:30 IST

ప్రతి వంద ఓటర్లకు ఒకసెక్షన్‌ ఇన్‌చార్జిని ని యమించాలని మాజీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు.

ప్రతి వంద ఓటర్లకు ఒక ఇన్‌చార్జి
మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి

మాజీ ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి

బేస్తవారపేట(కంభం),సెప్టెంబరు 28 : ప్రతి వంద ఓటర్లకు ఒకసెక్షన్‌ ఇన్‌చార్జిని ని యమించాలని మాజీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు. బుధవారం కంభం మం డల టీడీపీ సర్వ సభ్యసమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.  కంభం మండలంలో త్వరతిగతిన ఓటర్ల జాబితా పరిశీలన పూర్తి చేసే బాధ్యతను క్లస్టర్‌ ఇన్‌చార్జిలు తీసు కోవాలన్నారు. మూడేళ్లలో వైసీపీ చేసింది శూన్యమన్నారు. ధరలు, పన్నుల భారాలు మోపి ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు.  ఎమ్మెల్సీ  ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని గెలిపించాలన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు తోట శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి అరేపల్లి మల్లికార్జున, పార్లమెంట్‌ కార్యదర్శి కేతం శ్రీనివాసులు, గోనా చెన్నకేశవులు, అనీస్‌ అహ్మద్‌, ఎన్టీఆర్‌ గౌస్‌, కొత్తపల్లి వెంకటేశ్వర్లు, తోట శ్రీనివాసులు, బొందలపాటి రమణగని చిన్న వెంకటేశ్వర్లు, రవికుమార్‌, కోటయ్య  పాల్గొన్నారు.Read more