పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

ABN , First Publish Date - 2022-09-28T05:32:37+05:30 IST

పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుందని శాప్‌నెట్‌ చైర్మన్‌, వైసీపీ అద్దంకి నియోజకవర్గ ఇన్‌చార్జి బాచిన కృష్ణచైతన్య అన్నారు.

పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
రాచపూడిలో వృద్ధురాలితో మాట్లాడుతున్న కృష్ణచైతన్య

శాప్‌నెట్‌ చైర్మన్‌ బాచిన కృష్ణచైతన్య

మేదరమెట్ల, సెప్టెంబరు 27: పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుందని శాప్‌నెట్‌ చైర్మన్‌,  వైసీపీ అద్దంకి నియోజకవర్గ ఇన్‌చార్జి బాచిన కృష్ణచైతన్య అన్నారు. మంగళవారం రాచపూడిలో జరిగిన గడప గడ పకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన మాట్లాడా రు. గతంలో ఎన్నడూ లేనివిధంగా హామీలన్నింటిని నెర వేర్చిన ఘనత జగన్‌మోహన్‌రెడ్డిదేనని అన్నారు. కార్యక్ర మంలో ఎంపీపీ సాధినేని ప్రసన్నకుమారి, వీరగంధం పాండురంగారావు, వైసీపీ మండల కన్వీనర్‌ సాధినేని మస్తాన్‌రావు, పమిడిపాడు మాజీ సర్పంచ్‌ రావి శ్రీధర్‌,  కుర్రవానిపాలెం, అనమన మూరు, బొడ్డువానిపాలెం సర్పంచ్‌లు నాదెండ్ల దశరథరామయ్య, జం పు హరిబాబు,  నేరేళ్ల సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. 


ప్రభుత్వ సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలి

సంతమాగులూరు, సెప్టెంబరు 27: అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నట్టు శాప్‌నెట్‌ చైర్మన్‌, వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి బాచిన కృష్ణచైతన్య అన్నారు. మంగళవారం సంతమాగులూరులో స్త్రీశక్తి భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. వీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. వైఎస్‌ ఆర్‌ చేయూత పథకం కింద మండలంలో 2,734 మందికి రూ 5,12,62,500 విలువ గల చెక్కును  మహిళలకు అందజేశారు.

 కార్యక్రమంలో పార్టీ నేతలు చింతా రామారావు, కోటిరెడ్డి, అట్లా పెద వెంకటరెడ్డి, బొల్లానేని రామకృష్ణ, ఎంపీడీవో సాంబశివరావు, తహసీల్దార్‌ అశోక్‌వర్ధన్‌, జడ్పీటీసీ అడవి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. 


అర్హులందరికీ సంక్షేమ పథకాలు

కారంచేడు(పర్చూరు), సెప్టెంబరు 27: అర్హులైన ప్రతి కుటుంబాని కి సంక్షేమ పథకాల ఫలా లను అందించటమే లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వం పనిచేస్తుం దని ఆపార్టీ పర్చూరు నియో జకవర్గ ఇన్‌చార్జి రావి రా మ నాథంబాబు అన్నారు. మంగ ళవారం కారంచేడు మండల పరిషత్‌ కార్యాలయ ఆవరణ లో చేయూత పథకానికి సం బంధిం చిన చెక్కుల పంపి ణీ కార్యక్ర మం నిర్వ హించారు. ఎంపీపీ నీరు కట్టు వాసుబా బు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న రామనాథం బాబు మాట్లాడుతూ నవరత్నాల ద్వారా అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలుచేస్తూ మహిళా సమగ్రాభివృద్ధే ఎజెండాగా ప్రభుత్వం పనిచే స్తుందన్నారు. ఎంపీపీ నీరుకట్టు వాసుబాబు మాట్లాడుతూ పారదర్శ కంగా ప్రభుత్వ పథకాలు అందజేస్తున్న ఘనత వైసీపీ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. అనంతరం మం డలంలోని 1954 మంది లబ్ధిదారు లకు సంబంధించిన చెక్కును అందజేశారు. 

కార్యక్రమంలో జడ్పీటీసీ యార్లగడ్డ రజనీ, వైస్‌ ఎంపీపీ యార్లగడ్డ సుబ్బారావు, పార్టీ మండల అధ్యక్షుడు దండా చౌదరి, ఎంపీడీవో రమేష్‌, తహసీల్దార్‌ వెంకట రత్నం, సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2022-09-28T05:32:37+05:30 IST