బాలాత్రిపుర సుందరి పాలయమాం

ABN , First Publish Date - 2022-09-27T06:03:24+05:30 IST

దసర శరన్నవ రాత్రి ఉత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమ య్యాయి.

బాలాత్రిపుర సుందరి పాలయమాం
బాలత్రిపురసుందరిదేవి అలంకరణలో అమ్మవారు

 ఘనంగా ప్రారంభమైన నవరాత్రి ఉత్సవాలు

దేవాలయాలకు పోటెత్తిన మహిళలు

శోభాయమానంగా విద్యుత్‌ దీపాలంకరణలు

అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు

ఒంగోలు(కల్చరల్‌), సెప్టెంబరు 26: దసర శరన్నవ రాత్రి ఉత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమ య్యాయి. అక్టోబరు 5 వరకు జరిగే ఈ ఉత్సవాలలో ప్రతిరోజు అమ్మవారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిస్తారు. తొలిరోజు నగరంలోని పలు ఆలయా ల్లో అమ్మవారికి బాలాత్రిపుర సుందరీదేవిగా అలంకర ణ చేశారు. స్థానిక రంగారాయుడు చెరువు వద్దఉన్న కంచి కామాక్షి దేవస్థానంలో బాలికను  బాలాత్రిపుర సుందరీ దేవిగా భావిస్తూ భక్తులు పూజలు నిర్వహిం చారు.  మంగమూరు రోడ్డులోని అచలానంద ఆశ్రమం లో శ్రీగోవిందమాంబ అమ్మవారు బాలాత్రిపురసుం దరీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. కేశవస్వామిపే టలోని శ్రీప్రసన్న చెన్నకేశవస్వామి దేవస్థానం, శ్రీగం గా అన్నపూర్ణ సమేత కాశీవిశ్వేశ్వర స్వామి దేవస్థానం లోనూ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమ య్యాయి.  రాజ్యలక్ష్మి అమ్మవారు శ్రీ ఆదిలక్ష్మి దేవి అ లంకరణలో,  అన్నపూర్ణ అమ్మవారు రజత కవచాలం కృత అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు.  సో మవారం రాత్రి గుడివాడకు చెందిన శ్రీ శివజ్యోతి నృ త్యాలయ చిన్నారులు ప్రదర్శించిన జానపద నృత్యావళి కార్యక్రమం భక్తులను ఆకట్టుకుంది. ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షులు ఈదుపల్లి గురునాధరావు, కార్యని ర్వహణాధికారి డి.రజనీకుమారి, సభ్యులు కుర్రా ప్రసా ద్‌ బాబు, పుచ్చకాయల గోవర్థన రెడ్డి, నెమ్మాని హరిప్రియాదేవి  ఏర్పాట్లను పర్యవేక్షించారు. 

కొత్తపట్నం బస్టాండులో గల శ్రీరాజరాజేశ్వర స్వా మి దేవస్థానంలో అమ్మవారికి ఆలయ అర్చకబృందం ప్రత్యేక పూజలు నిర్వహించారు కేశవస్వామి పేట శ్రీ విజయదుర్గా దేవి దేవస్థానంలో అమ్మవారికి విశేష అలంకరణ, ప్రత్యేక పూజలు, పంచామృతాభిషేకం తది తర కార్యక్రమాలను శాస్ర్తోక్తంగా నిర్వహించారు. సం తపేట సాయిబాబా మందిరంలోని శ్రీనాగలక్ష్మీ అమ్మ వారికి  విశేష అలంకరణ, ప్రత్యేక పూజలు జరిగాయి. మందిర కమిటీ నిర్వాహకులు అళహరి చెంచల రావు పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమాలలో మహిళలు పెద్దసంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.  గద్దలగుంట శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం, బాలాజీరావుపేట శ్రీ పార్వతీ అమ్మవారి దేవస్థానం, బీవీఎస్‌ హాలు వద్ద ఉన్న శ్రీమహాలక్ష్మి దేవస్థానం, గంటాపాలెం శ్రీపోలేరమ్మ దేవస్థానం, లాయర్‌పేట సాయిబాబా మందిరంలోని శ్రీరాజరాజేశ్వరి అమ్మవారి ఆలయం, శ్రీ లలితాశ్రమం తదితర దేవస్థానాలలో సైతం అమ్మవారికి విశేష అలంకరణలు నిర్వహిం చారు. భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.  


దుర్గాదేవిగా భక్తులకు దర్శనం

నాగులుప్పలపాడు(ఒంగోలు రూరల్‌), సెప్టెంబరు 26:    మండలంలోని చీర్వానుప్ప లపాడు గ్రామంలో వేంచేసి ఉన్న ఉమామహేశ్వరస్వామి దేవాలయంలో సోమవారం నవరాత్రుల ఉత్సవాలు ఘనంగా ప్రారం భమయ్యాయి. అమ్మవారిని దుర్గాదేవి అలంకరణ చేసి భక్తులకు దర్శనం కల్పించారు. భక్తులు దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.


పృథులగిరి దసరా బ్రహ్మోత్సవాలు ఆరంభం

మర్రిపూడి, సెప్టెంబరు 26 : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పృథులగిరి లక్ష్మీనరసింహస్వామి దసరా బ్రహ్మోత్సవాలు సోమవారం అంగరంగవైభవంగా ప్రారంభమయ్యాయి. స్థానిక వేణుగోపాలస్వామి దేవాలయంలో ఉన్న ఉత్సవమూర్తులను గ్రామంలోని ప్రధాన వీధులలో గ్రామోత్సవం నిర్వహించారు. 

ఈ సందర్భంగా గ్రామస్థులు స్వామివారికి కొబ్బరికాయలు కొట్టి హారతులు ఇచ్చి మొక్కులు తీర్చుకున్నారు. నాల్గవ తేదీన గరుడసేవ, ఐదవ తేదీన పా ర్వేట ఉత్సవం జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. చిమట, కాకర్ల గ్రామాలకు చెందిన పొతకమూ రి వంశస్థులు దసరా బ్రహ్మోత్సవాలకు శాస్వత ఉభయదాతలుగా వ్యవహరిస్తున్నారు. 

Read more