చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి

ABN , First Publish Date - 2022-02-20T04:20:41+05:30 IST

ప్రతిఒక్కరూ చట్టాలపై అవగాహన కల్గి ఉండాలని మార్కాపురం సీనియర్‌ సివిల్‌ జడ్జి ఎన్‌.రమేష్‌ నాయుడు అన్నారు.

చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి
మాట్లాడుతున్న జడ్జి రమేష్‌నాయుడు

సీనియర్‌ సివిల్‌ జడ్జి రమేష్‌నాయుడు

పెద్ద దోర్నాల, ఫిబ్రవరి 19 : ప్రతిఒక్కరూ చట్టాలపై అవగాహన కల్గి ఉండాలని మార్కాపురం సీనియర్‌ సివిల్‌ జడ్జి ఎన్‌.రమేష్‌ నాయుడు అన్నారు. స్థానిక మణికంఠ బొగ్గరపు సత్యమమ్మ కళ్యాణ మండపంలో మం డల న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యా య విజ్ఞాన సదస్సు శనివారం జరిగింది. ఈ సందర్భంగా మార్కాపురం సీనియర్‌ సివిల్‌ జడ్జి ఎన్‌.రమేష్‌ నాయుడు మాట్లాడుతూ ప్రధానంగా భూముల విషయంలోనే అధికంగా ఇబ్బందులు పడుతున్నారని, రెవెన్యూ అధికారులు కొందరు చేసే పొరపాట్ల వల్ల గ్రామాల్లో ఘర్షణలు ఏర్పడే అవకాశాలున్నాయని అన్నారు. భూములకు సంబంధించిన రికార్డులు తప్పిదాలు లేకుండగా సరిచూసుకోవలసిన బాధ్యత అధికారుల్లో ఉండాలని, అలాగే భూ ములకు సంబంధించిన వివరాలు రైతులు కూడా ఎప్పటికప్పుడు పరిశీలించుకుని జాగ్రత్త పడాలన్నారు. ఏదైనా అన్యాయం జరిగితే పేద వారికి న్యాయం అందించేందుకు న్యాయ వ్వవస్థ ఉందన్నారు. ఆ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఫస్ట్‌ క్లాస్‌ మేజిస్ట్రేట్‌ షేక్‌ అబ్దుల్‌ రెహమాన్‌, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు నారాయణ రెడ్డి, న్యాయవాధి వల్లపునేని కాశయ్య పాల్గొన్నారు. 


Read more