కార్పొరేట్ల కాపలాదారు మోదీ

ABN , First Publish Date - 2022-11-30T22:16:05+05:30 IST

కార్పొరేట్ల కాపలాదారు ప్రధాని మోదీ అని సీపీఐ రాష్ట్రకార్యదర్శి వర్గ సభ్యుడు గుజ్జుల ఈశ్వరయ్య అన్నారు. సీపీ ఐ ఎర్రగొండపాలెం నియోజకవర్గ జనరల్‌బాడీ సమావేశం బుధవారం ని ర్వహించారు.

కార్పొరేట్ల కాపలాదారు మోదీ
మాట్లాడుతున్న ఈశ్వరయ్య

సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఈశ్వయ్య

ఎర్రగొండపాలెం, నవంబరు 30 : కార్పొరేట్ల కాపలాదారు ప్రధాని మోదీ అని సీపీఐ రాష్ట్రకార్యదర్శి వర్గ సభ్యుడు గుజ్జుల ఈశ్వరయ్య అన్నారు. సీపీ ఐ ఎర్రగొండపాలెం నియోజకవర్గ జనరల్‌బాడీ సమావేశం బుధవారం ని ర్వహించారు. నియోజకవర్గ కార్యదర్శి డి.శ్రీనివాసులు అధ్యక్షతన జరిగిన స మావేశంలో ఈశ్వరయ్య మాట్లాడుతూ ప్రధాని మోదీ అధికారంలోకి వస్తే నల్లధనాన్ని తెచ్చి పేదల ఖాతాల్లో వేస్తామని చెప్పి మోసం చేశారన్నారు. రూ.400 ఉన్న గ్యాస్‌ సిలిండర్‌ రూ.1200లకు పెంచారన్నారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలను ఇష్టానుసారంగా పెంచి పేద, మధ్య తరగతివర్గాలపై భా రాలు మోపారన్నారు. జగన్‌రెడ్డి మెప్పు కోసం మోదీకి విశాఖకు ఆహ్వా నించి సన్మా నించడం ఏమిటని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఒక్క సాగు నీటి ప్రాజెక్టును కూడా జగన్‌రెడ్డి పూర్తి చేయలేదన్నారు. సీపీఐ జిల్లా సీపీ ఐ కార్యదర్శి ఎంఎల్‌ నారాయణ, నాయకులు టీసీహెచ్‌ చెన్నయ్య, కేవీ కృ ష్ణగౌడ్‌, గురునాథం, గురవయ్య, రామయ్య, విశ్వరూపాచారి పాల్గొన్నారు.

Updated Date - 2022-11-30T22:16:05+05:30 IST

Read more