-
-
Home » Andhra Pradesh » Prakasam » Modi has done great injustice to the state-NGTS-AndhraPradesh
-
‘రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిన మోదీ’
ABN , First Publish Date - 2022-07-05T05:35:33+05:30 IST
రాష్ట్రానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్ర అన్యాయం చేశారని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఈదా సుధా కర్‌రెడ్డి ధ్వజమెత్తారు.

ఒంగోలు(కలెక్టరేట్), జూలై 4: రాష్ట్రానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్ర అన్యాయం చేశారని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఈదా సుధా కర్‌రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో పర్యటించే అర్హత ఆయనకు లేదన్నారు. మోదీ పర్యటనను నిరసిస్తూ సోమవారం కలెక్టరేట్ వద్ద జరిగిన ధర్నాలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర విభజన జరిగి ఎనిమిదేళ్ళు గడుస్తున్నా ప్రత్యేక హోదాతో పాటు రాష్ట్రానికి రావాల్సిన రాయితీలను ఇవ్వడంలో పూర్తిగా విఫ లమయ్యారని ధ్వజమెత్తారు. అధికారంలోకి రాక ముందు అనేక మోసపూరి త హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక అవి ముగిసిన అధ్యాయం అని ప్రజలను నిలువునా మోసం చేశారని ఆరోపించారు. ప్రత్యేక హోదా రాష్ట్ర ప్రజల హక్కు అని అన్నారు. అటువంటి హక్కును కాలరాసే విధంగా కేం ద్ర ప్రభుత్వం మోసం చేస్తుంటే రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం పట్టీపట్టనట్లు వ్యవహరిస్తుందని విమర్శించారు. ఈనెల 18న జరిగే రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి వైసీపీ ఎందుకు మద్దతు ఇస్తుందో జగన్మోహన్‌రెడ్డి ప్రజలకు సమా ధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కొండారెడ్డి, ఉద్దండి మల్లికార్జునరావు, సుదర్శి రవి, మన్నం ప్రసన్నరాజు, ఎస్‌కే రసూల్, బోడ్డు సతీష్, జకోబ్, సామ్యేలు, కోటేశ్వరరావు పాల్గొన్నారు.