ఎమ్మెల్యే టీజేఆర్‌..నోరు అదుపులో పెట్టుకో..!

ABN , First Publish Date - 2022-11-21T00:23:31+05:30 IST

వైసీపీ ఎమ్మెల్యే టీజేఆర్‌.సుధాకర్‌బాబు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్‌ విభాగం నాయకులు హెచ్చరించారు.

ఎమ్మెల్యే టీజేఆర్‌..నోరు అదుపులో పెట్టుకో..!

స్థాయి మరచి విమర్శలు చేస్తే ఊరుకోం..

దమ్ముంటే నగర అభివృద్ధిపై చర్చకు రావాలి

టీడీపీ ఎస్సీసెల్‌ సవాల్‌

ఒంగోలు(కార్పొరేషన్‌), నవంబరు 20 : వైసీపీ ఎమ్మెల్యే టీజేఆర్‌.సుధాకర్‌బాబు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్‌ విభాగం నాయకులు హెచ్చరించారు. ఆది వారం ఒంగోలులోని ఎన్టీఆర్‌ భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడు తూ తమ నాయకులు చంద్రబాబునాయుడు, దామచర్ల జనార్దన్‌ల గురించి నోటికొచ్చినట్లు మా ట్లాడితే ఊరుకునేది లేదని మండిపడ్డారు. చం ద్రబాబు ఆదోనీ పర్యటన, దామచర్లను విమర్శిం చే అర్హత స్థాయి లేదని విమర్శించారు. టీజేఆర్‌ అవినీతి గురించి మాట్లాడుతుంటే దయ్యాలు వే దాలు వల్లించినట్లుందని పేర్కొన్నారు. జిల్లాలోనే అవినీతిలో మొదటిస్థానంలో ఉన్న టీజేఆర్‌, సీ ఎం జగన్‌.. ఎమ్మెల్యే బాలినేని దగ్గర మెప్పు కో సం నోరుపారేసుకుంటే తీవ్ర పరిణామాలు ఉం టాయని ఘాటుగా హెచ్చరించారు. ఒంగోలు ని యోజకవర్గం అభివృద్ధిపై తమ పార్టీ చర్చకు ఎ క్కడికైనా సిద్ధమే అన్నారు. ముందు బాలినేని చే సిన అవినీతి ప్రశ్నించాలని హితవుపలికారు. జ గనన్న కాలనీల పేరుతో యరజర్ల వద్ద ఏర్పాటు చేసిన స్థలాల్లోని టన్నుల కొద్ది మట్టిని బాలినేని వియ్యంకుడు విల్లాలకు తరలిస్తే ఎందుకు ప్ర శ్నించలేదన్నారు. ఎస్‌ఎన్‌.పాడు నియోజకవర్గం లో అధికారులు, ముఖ్యంగా మహిళ ఉద్యోగులు నిరంతరం భయంతో పని చేస్తున్నారన్నారు. టీజేఆర్‌ లైంగిక వేధిపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. గ్రానైట్‌ వ్యాపారుల వద్ద నుంచి నె లనెలా మామూళ్ళు, ఇసుక రీచ్‌ల వద్ద వసూళ్ళ దందా వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఎదుట వారిని విమర్శించే ముందు నీ స్థాయి, అర్హత తెలుసుకుని మాట్లాడాలని ధ్వజమెత్తారు. తమ నాయకుడు దామచర్ల జనార్దన్‌ ఎమ్మెల్యేగా ఒం గోలు నియోజకవర్గంలో రూ.2,615 కోట్లుతో అభి వృద్ధి చేశారని, దీనిపై బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్‌ విసిరారు. మరోసారి తమ పార్టీ నా యకులను విమర్శిస్తే ఊరుకునేది లేదని, తగిన గుణపాఠం చెబుతామని టీజేఆర్‌ను హెచ్చరించా రు. సమావేశంలో ఎస్సీసెల్‌ రాష్ట్ర నాయకులు ఎ ద్దు శశికాంత్‌ భూషణ్‌, ఒంగోలు పార్లమెంట్‌ అ ధ్యక్షులు చుండి శ్యామ్‌, నగర అధ్యక్షులు నావూరి కుమార్‌, హగ్గయ్యరాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-21T00:24:02+05:30 IST