‘ఉపాధి’ పనుల్లో నిధుల దుర్వినియోగం

ABN , First Publish Date - 2022-11-30T22:08:10+05:30 IST

ఉపాధి హామీ పథకం పనుల్లో నిధులు దుర్విని యోగమయ్యాయి. పుల్లలచెరువు మండలంలో జరిగిన పనుల్లో బోర్డులు పెట్టకుండా నిధులు ఖర్చుచూపించారని, ఈ పనుల్లో 14.60 లక్షల రికవరీని గుర్తిం చారు.

‘ఉపాధి’ పనుల్లో నిధుల దుర్వినియోగం

ప్రజా వేదికలో గుర్తించిన సోషల్‌ ఆడిట్‌ బృందం

రూ.14.60 లక్షల రికవరీ

కనిపించని పండ్ల తోటలు 8 రైతులకు నోటీసులు ఇవ్వాలని ఆదేశం

పుల్లలచెరువు, నవంబరు 30 : ఉపాధి హామీ పథకం పనుల్లో నిధులు దుర్విని యోగమయ్యాయి. పుల్లలచెరువు మండలంలో జరిగిన పనుల్లో బోర్డులు పెట్టకుండా నిధులు ఖర్చుచూపించారని, ఈ పనుల్లో 14.60 లక్షల రికవరీని గుర్తిం చారు. గత ఏడాది 2020 -2021, 2021-2022 సంవత్సరానికి ఉపాధి ద్వారా మార్చి వరకు జరి గిన పనుల్లో రూ.14.60 లక్షలు దుర్వినియోగం జరిగినట్లు ఆడిట్‌ అధికారులు గుర్తించారు. బుధవారం నిర్వహించిన ప్రజా వేదికకు డ్వామా పీడీ శీనారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆడిట్‌లో ఉపాధి సిబ్బంది బినామీ పేర్లతో 1.47 లక్షలు, పనుల వద్ద బోర్డులు పెట్టకుండా 9.77 లక్షలు, హౌసింగ్‌ కాలనీలో కొలతలు రూ.86 వేలు, పాఠ శాలల్లో పనులకు రూ.83 వేలు తేడాను గుర్తించారు. సాగు చేసిన పండ్ల తోటల్లో 34 లక్షల రూపాయలకు పనులు జరుగగా సాగు చేసిన భూముల్లో ఒక్క మొక్క లేకపోవడంతో పండ్ల తోటలు సాగు చేసిన రైతులకు నోటీసులు జారీ ఇవ్వనున్నారు. కార్యక్రమంలో డీవీవో వెంకటస్వామి, పరిశీలకులు మీరావలీ, ఏపీడీ రాజారావు, ఇన్‌చార్జి ఎంపీడీవో రాజ్యలక్ష్మి, ఏపీవో శైలజ, ఉపాధి సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2022-11-30T22:08:13+05:30 IST