మలేరియా నివారణకు చర్యలు తీసుకోవాలి

ABN , First Publish Date - 2022-04-24T05:50:21+05:30 IST

జిల్లాలో మలేరియా నివారణకు అధికారులు పటిష్ట చర్య లు తీసుకోవాలని కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ ఆదే శించారు. శనివారం స్థానిక కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో జరిగిన సమావేశంలో ఆయన మా ట్లాడారు.

మలేరియా నివారణకు చర్యలు తీసుకోవాలి

కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ ఆదేశం


ఒంగోలు(కలెక్టరేట్‌), ఏప్రిల్‌ 23 : జిల్లాలో మలేరియా నివారణకు అధికారులు పటిష్ట చర్య లు తీసుకోవాలని కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ ఆదే శించారు. శనివారం స్థానిక కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో జరిగిన సమావేశంలో ఆయన మా ట్లాడారు. మలేరియా బారిన పడిన వారు పూర్తి స్థాయిలో వైద్య చికిత్స పొందేలా వారిలో అవ గాహన కల్పించాలన్నారు. పాఠశాలలు, హాస్టళ్ళ పైనా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, మైనింగ్‌ కా ర్యకలాపాలు నిలిచిపోయిన గనుల్లో నీరు నిల్వ లేకుండా ప్రత్యేక కార్యచరణ రూపొందించాలని ఆయన సూచించారు. గిరిజన ప్రాంతాల్లో దోమ ల ప్రభావాన్ని తగ్గించేందుకు వైద్యులు, మండల అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఆదేశించారు. చీమకుర్తి, పెద్దదోర్నాల, మార్కా పురం, గిద్దలూరు, యర్రగొండపాలెం మండలా లు ఎక్కువగా మలేరియా కేసులు నమోదవు తున్న ప్రాంతాలుగా గుర్తించామని మలేరియా నివారణాధికారి జ్ఞానశ్రీ కలెక్టర్‌ దృష్టికి తెచ్చారు. దీనిపై కలెక్టర్‌ మాట్లాడుతూ ఈనెల 25న అ న్నిచోట్ల అవగాహన ర్యాలీలు నిర్వహించాలని  ఆదేశించారు. అనంతరం పోస్టర్లను ఆవిష్కరిం చారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారు లు పి.రత్నావళి, ఉష, మాధవీలత, బాబురావు, రవికుమార్‌, లక్ష్మానాయక్‌, జాలిరెడ్డి, నారాయ ణరెడ్డి, మర్దన్‌ఆలీ, విజయభాస్కర్‌, పద్మజ, అం జల, వాణిశ్రీ, భాగ్యలక్ష్మి, సుధ పాల్గొన్నారు.

 


Updated Date - 2022-04-24T05:50:21+05:30 IST